Sesham Mike-il Fathima OTT : ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న మ‌ళయాళ సూప‌ర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

December 11, 2023 7:22 PM

Sesham Mike-il Fathima OTT : మ‌ల‌యాళ మూవీస్ కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తున్న విషయం తెలిసిందే. క్రైమ్‌, కామెడీ, సస్పెన్స్, హార్రర్, థ్రిల్లర్‌.. ఏ జోనర్‌ మలయాళ సినిమాలకైనా సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. సహజత్వానికి పెద్ద పీట వేయడమే మాలీవుడ్‌ సినిమాలకి స్పెష‌ల్‌గా చెప్పుకోవ‌చ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన 2018, పద్మినీ, జర్నీ ఆఫ్‌ 18 ప్లస్, ఆర్‌ డీ ఎక్స్‌, కాసర్‌ గోల్డ్‌, కన్నూర్‌ స్వ్కాడ్‌ తదితర మలయాళ సినిమాలు తెలుగు ఆడియెన్స్‌ను బాగా అలరించాయి. ఇప్పుడుమరో మలయాళ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. తెలుగు వెర్షన్‌లో కూడా స్ట్రీమింగ్‌ కానుంది. అదే కల్యాణి ప్రియ దర్శన్‌ నటించిన శేషమ్ మైక్-ఇల్ ఫాతిమా.

కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో వ‌చ్చిన చిత్రం శేషమ్ మైకేల్ ఫాతిమా సినిమాకి మను సి కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నవంబర్ 17న థియేటర్లలో విడుద‌లై మంచి విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా ప్ర‌శంస‌లు కూడా అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ శేషమ్ మైక్-ఇల్ ఫాతిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేస్తోంది. డిసెంబర్‌ 15 నుంచే కల్యాణి ప్రియ దర్శన్‌ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

Sesham Mike-il Fathima OTT know the streaming details
Sesham Mike-il Fathima OTT

ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై జగదీష్ పళనిసామి, సుధన్ సుందరం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌గా.. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు.ఈ మూవీ క‌థ విష‌య‌నికి వ‌స్తే.. ముస్లిం కుటుంబానికి చెందిన ఫాతిమా నూర్జహాన్‌(కల్యాణి ప్రియదర్శన్)కు ఫుట్‌ బాల్‌ కామెంటేటర్ కావాల‌ని అనుకుంటుంది. అయితే ఫ్యామిలీలో ఎవరి మద్దతు లభించదు. దీంతో స్థానిక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకు కామెంటరీ చేస్తూ జీవితం ముందుకు సాగ‌దీస్తుంది. . అయితే ఇంటర్నేషనల్‌ ఫుట్ బాల్‌ మ్యాచ్‌లకు కామెంటరీ కావాలన్నదే ఫాతిమా లక్ష్యం కాగా, మరి ఆమె లక్ష్యం నెరవేరిందా? అందుకు ఫాతిమా స్నేహితులు ఎలాంటి సాయం చేశారన్నది అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now