పశ్చిమ బెంగాల్ లో వింత మేక పిల్ల జననం.. ఏకంగా 8 కాళ్ళతో..!

July 20, 2021 8:17 PM

సాధారణంగా మేకలకు నాలుగు కాళ్ళు ఉంటాయని మాత్రమే తెలుసు. కానీ పశ్చిమబెంగాల్లోని కాలామేఘా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఓ మహిళకు ఒక మేక ఉంది. అయితే ఆ మేక ఒక వింత మేక పిల్లలకు జన్మనిచ్చింది. ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఏకంగా ఎనిమిది కాళ్ళతో ఉన్న మేక పిల్లలకు జన్మనివ్వడంతో ఈ వింతను చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా సరస్వతి మాట్లాడుతూ తన దగ్గర ఒక ఆవు, మేక ఉందని, మేక గురువారం రెండు మేక పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఒకటి ఎంతో ఆరోగ్యంగా, సాధారణంగా జన్మించగా. మరొక మేక పిల్ల మాత్రం 8 కాళ్ళతో,రెండు తుంటి భాగాలతో జన్మించింది. అయితే ఆ మేక పిల్ల ఎక్కువసేపు బ్రతక లేదని, జన్మించిన ఐదు నిమిషాలకే మరణించినట్లు సరస్వతి తెలిపారు.

ఈ విధంగా ఎనిమిది కాళ్లతో జన్మించిన మేకపిల్లను తామెప్పుడూ చూడలేదని గ్రామస్తులు తెలిపారు. ఈ వింత మేకపిల్లను చూడటానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఎంతో ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెలియడంతో ఇది కాస్త వైరల్ అయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now