మీకు రేషన్ కార్డు ఉందా.. అయితే మీకిది శుభవార్త..!

July 20, 2021 1:25 PM

మీకూ రేషన్ కార్డు ఉందా.. అయితే మీకు ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మాదిరిగానే రేషన్ కార్డు కూడా ఎంతో విలువైనది అని చెప్పవచ్చు. రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం అందిస్తున్నటువంటి వివిధ రకాల నిత్యావసర సరుకులను తక్కువ ధరకే మనం పొందవచ్చు. ప్రతి నెల ఈ రేషన్ సరుకులను మనం ప్రభుత్వ రేషన్ దుకాణానికి వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. మరి కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వం అందించే టటువంటి ఈ సరుకులు ప్రజల ఇంటివద్దకే వెళ్లి అందిస్తున్నారు.అయితే ఇకపై రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవాలి అనే బాధ వినియోగదారులకు తప్పుతుందని చెప్పవచ్చు.

if you have ration card then its good news for you

రేషన్ సరుకులు పొందాలంటే మరికొన్ని రోజులలో ఏటీఎంల ద్వారా రేషన్ బియ్యాన్ని పొందవచ్చు. ఇప్పటికే హరియాణాలోని గురుగ్రామ్‌లో పైలెట్ ప్రాజెక్ట్ కింద రేషన్ ఏటీఎంను ఏర్పాటు చేశారు. దేశంలోనే ఇది మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎం అని చెప్పవచ్చు. రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఏటీఎం దగ్గరికి వెళ్లి వేలిముద్ర పెడితే మనకు రావాల్సిన సరుకులు మనకు వస్తాయి.

గ్రెయిన్ ఏటీఎం దగ్గర వేలి ముద్రతో పాటు, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ నంబర్లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.ఈ విధంగా ఏటీఎం ద్వారా రేషన్ సరుకులను అందుబాటులోకి తీసుకురావటం వల్ల నెలకు ఒకసారి మనకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు సరుకులను తీసుకోవచ్చు. అదేవిధంగా ఏటీఎం ద్వారా సరుకులను ఖచ్చితమైన తూకానికే పొందవచ్చు. ఈ విధంగా ఏటీఎం ద్వారా సరుకులను పొందడం నిజంగానే లబ్ధిదారులకు ఉపశమనం కలిగించే విషయమని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now