Guppedantha Manasu December 8th Episode : శైలేంద్ర‌కు దిష్టి తీసిన వసుధార.. దేవయానికి వసుధార వార్నింగ్..!

December 8, 2023 9:56 AM

Guppedantha Manasu December 8th Episode : రిషి కనపడకపోవడంతో, వసుధార, మహేంద్ర కంగారు పడతారు. అనుపమ సలహాతో ముకుల్ కి కంప్లైంట్ ఇస్తాడు మహేంద్ర. రిషి కోసం వసుధార వెతుకుతుంది. తనకు తెలిసిన దగ్గర ఆమె వెళ్లి చూస్తుంది. కానీ అక్కడ రిషి ఉండడు. రిషి కనపడకపోవడంతో, ముకుల్ షాక్ అవుతాడు. తనకి ఈ విషయం ముందుగానే చెప్తే బాగుండేదని, ఇన్వెస్టిగేషన్ చేసేవాడినని మహేంద్ర తో అంటాడు. జరుగుతున్న సంఘటన చూస్తుంటే, మీ ఫ్యామిలీలో ఏదో కుట్ర జరుగుతోందని, అది ఎన్ని వాటికి దారితీస్తుందో ఏంటో అని అంటాడు. శైలేద్నరా మీద అనుమానం వచ్చి, ఇన్వెస్టిగేషన్ చేయాలని అనుకున్న టైంలోని అతని మీద అటాక్ జరగడం, రిషి కనపడకపోవడం ఏదో లింక్ ఉందని ముకుల్ అంటాడు.

శైలేంద్ర పై అనుమానం ఏంటని ముకుల్ ని అడుగుతుంది అనుపమ. జగతి మేడం హత్య కేసులో ప్రధాన అనుమానితుడు శైలేంద్ర అని చెప్తాడు. అతని మాటలు విని అనుపమ షాక్ అవుతుంది. శైలేంద్ర ని ఇంటర్వ్యూ చేయడానికి హాస్పిటల్ కి వెళ్ళానని దేవయాని అందుకు ఒప్పుకోలేదని అనుపమకి ముకుల్ చెప్తాడు. శైలేంద్ర కోలుకుంటేనే కుట్రల పై క్లారిటీ వస్తుందని అంటాడు. అతని కండిషన్ ఎలా ఉందని మహేంద్రని కనుక్కోమని చెప్తాడు. మహేంద్ర తో పాటుగా హాస్పిటల్ కి వెళుతుంది అనుపమ. ఆమెను చూడగానే దేవయాని కంగారుపడుతుంది.

శైలేంద్ర ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారని దేవయానిని అడుగుతుంది అనుపమ. నేను బాగున్నాడని అడిగితే బాగా లేనివాడు బాగవుతాడా, బాగున్నవాడు కూడా బాగా లేకుండా పోతాడా అని తిక్క తిక్కగా దేవయానికి సమాధానం చెబుతుంది అనుపమ. శైలేంద్ర కండిషన్ బాగుందని, ఈరోజు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని చెప్తారు. రిషి ఆచూకీ దొరకలేదని, అతడు ఇంకా ఇంటికి తిరిగి రాలేదని ఫణింద్ర తో మహేంద్ర అంటాడు. దేవుడా ఏంటి నాకు ఈ పరిస్థితిని తీసుకొచ్చావు. ఇద్దరు బిడ్డల్ని ఇలా ఎందుకు చేశావు.

ఒక కొడుకు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. ఇంకొకరు కనపడకుండా పోయారు అని కన్నీళ్లు పెట్టుకున్నట్లు నాటకం ఆడుతుంది దేవయాని. అనుపమ ముందు సింపతి మార్కులు కొట్టేస్తుంది. రిషి కోసం వసుధార వెతుకుతోంది అని, ఫణింద్ర తో మహేంద్ర చెప్తాడు. రిషి కనపడలేదన్న విషయం ముకల్ కి చెప్పానని, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడని వసుధారకి ధైర్యం చెప్తాడు మహేంద్ర. ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. అక్కడికి వచ్చేయమని అంటాడు. మహేంద్ర ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఆలోచిస్తాడు. ఇదివరకు జరిగిందని గుర్తు చేసుకుంటాడు.

Guppedantha Manasu December 8th Episode today
Guppedantha Manasu December 8th Episode

శైలేంద్రని లోపలికి తీసుకు వెళ్ళమని దేవయానీ తో చెప్తాడు ఫణింద్ర. ఎవరు నా కొడుకు నాశనం కోరుకున్నారో, ఏ పాడు కళ్ళు పడ్డాయో ఏమో వాటి వలన నా కొడుకు హాస్పిటల్ పాలయ్యాడని దేవయాని అంటుంది. క్షేమంగా కోలుకొని ఇంటికి వచ్చిన అతనిని దిష్టి తీసి లోపలికి ఆహ్వానిస్తే మంచిదని దేవయాని అంటుంది. వసుధారా ని దిష్టి తీయమని అంటుంది సైలేంద్రకి ఏ కీడు జరగకూడదని దిష్టి తీయమని చెప్తుంది. శైలేంద్ర కి హారతి ఇవ్వడానికి వసుధార ఒప్పుకుంటుంది. జగతి మేడం ప్రాణాలు తీసినందుకు మట్టి కొట్టుకొని పోతావు అని హారతి పళ్లెంలోని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తున్నా అని మనసులో అనుకుంటుంది.

పళ్లెంలోనే దిష్టి నీళ్లు కావాలని దేవయాని మీద పోస్తుంది. రిషి కనపడట్లేదేంటి అసలు ఎక్కడికి వెళ్ళాడు, 24 గంటలు గడిచిన రాలేదంటే కొంపతీసి జగతికి జరిగినట్లు రిషి కూడా అని వసుధారతో దేవయాని ఉంటుంది. ఆమె మాట పూర్తి చేయక ముందే వసుధారా ఫైర్ అవుతుంది. కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది. జగతి మేడం నేర్పిన సంస్కారం వలన చేయి ఆగిపోయింది. నా భర్త గురించి ఇంకొకసారి అపశకునం మాటలు మాట్లాడితే అని మండిపడుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now