Guppedantha Manasu December 6th Episode : రిషి తిరిగి రావకపోవడంతో వ‌సుధార టెన్షన్.. శైలేంద్ర బుట్ట‌లో పడిపోయిన ధ‌ర‌ణి..!

December 6, 2023 9:41 AM

Guppedantha Manasu December 6th Episode : శైలేంద్రకి తోడుగా, హాస్పిటల్ లో మహేంద్ర కలిసి ఉండాలని, ఫిక్స్ అయినా ఫణింద్ర దేవయానికి ఇంటికి వెళ్ళిపోమని చెప్తాడు. తను ఇంటికి వెళ్తే శైలేంద్ర నాటకం మొత్తం బయటపడుతుందని, దేవయాని కంగారు పడిపోతుంది. ఇక్కడే ఉండి, శైలేంద్ర పరిస్థితి బాగాలేదని అందరిని నమ్మించాలని, మనసులో ఆమె అనుకుంటుంది. ఈ పరిస్థితుల్లో వదిలిపెట్టి వెళ్ళనని చెప్తుంది. శైలేంద్ర విషయం బయట పడకూడదని జాగ్రత్త పడడానికి దేవయానికి హాస్పిటల్లో ఉంటానని అంటోందని, మహేంద్ర కి అర్థమవుతుంది.

రిషి కనపడకపోవడంతో వసు కంగారు పడిపోతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏదో పని ఉండి వెళుతున్నారని మెసేజ్ చేశాడు కదా భయపడొద్దు అని మహేంద్ర అంటాడు. రిషికి ఏం కాదని అంటాడు. జగతి మేడం చావుకి కారణమైన వాళ్ళని పట్టుకోవాలని, ఎప్పటినుండో రిషి చూస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైన పని. దీనికి మించి రిషికి ఇంపార్టెంట్ ఏం ఉందని ఆలోచిస్తున్నాను అని మహేంద్రతో వసుధార అంటుంది. ఇన్నాళ్లు మంచివాడు అనుకున్నా అన్నయ్య, తల్లి చావుకి కారణం అని, ఆలోచన రిషి ని సందిగ్ధంలో పడేసింది.

ఈ పరిస్థితిని ఎదుర్కోలేక వెళ్ళిపోయి ఉంటాడు. గతంలో నాపై, జగతి పై కోపంతో చాలాసార్లు ఇంట్లో నుండి వెళ్లిపోయి. మళ్ళీ తిరిగి వచ్చాడని మహేంద్ర చెప్తాడు. హాస్పిటల్ నుండి వసుధారా, మహేంద్ర ఇంటికి వచ్చేసరికి, వారి కోసం అనుపమ ఎదురుచూస్తుంది. నువ్వేంటి ఇక్కడ రావద్దని చెప్పాను కదా అని అంటాడు. ఇంటిదాకా వచ్చిన వాళ్ళని లోపల దాకా పిలవకపోతే ఎలా అని, అనుపమని లోపలికి పిలుస్తాడు. నీ పాజిటివ్ థింకింగ్ చాలా నచ్చింది వసుధార అని అనుపమ ప్రశంసలు కురిపిస్తుంది.

Guppedantha Manasu December 6th Episode today
Guppedantha Manasu December 6th Episode

చిత్ర విషయంలో నిందలు వేసినా కూడా, నిన్ను పోలీసులకి పట్టించిన అవేమీ మనసులో పెట్టుకోకుండా నాతో పాజిటివ్ గా ఉంటున్నావు అని వసుధారని పొగుడుతుంది అనుపమ. చాలా విషయాల్లో, నువ్వు ఇంప్రెస్సివ్ గా కనిపిస్తావు. కానీ, ఎండి సీట్ కి నువ్వు అర్హురాలివి కాదని అనిపిస్తోందని అనుపమ అంటుంది. మహేంద్ర సీరియస్ అవుతాడు. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ తో, నీకు అవసరం ఉండదని కోప్పడతాడు. వసుధార, మహేంద్ర అలసిపోయారని అనుపమ కాఫీ తీసుకొస్తుంది. శైలేంద్ర పరిస్థితి చూసిన ధరణి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే, నాకు చాలా బాధగా ఉందని శైలేంద్ర భార్య మీద ప్రేమ కురిపిస్తాడు.

నా వల్ల ఈరోజు మీరు పరిస్థితుల్లో ఉన్నారు అని ఎమోషనల్ అయిపోతుంది ధరణి. నాకోసం మీరు మంచిగా మారిపోయి హ్యాపీగా ఉన్న టైంలో ఇలా జరిగిందని బాధపడుతుంది. ధరణి ఫుల్లుగా తన బుట్టలో పడిపోయిందని, శైలేంద్ర అనుకుంటాడు. తనని ఆయుధంగా ఉపయోగించుకుని, ఎండి సీటు దక్కించుకోవాలని అనుకుంటాడు. రిషి, జగతికి తాను చేసిన పాపం వల్ల ఇలా జరిగిందని కొత్త డ్రామా ని స్టార్ట్ చేస్తాడు. ఆ రౌడీలు ఎవరు అనే ధరణి అడుగుతుంది. శైలేంద్ర నాకు కూడా తెలియదు అని అంటాడు. బహుశా కాలేజీ కోసం ఇలా చేస్తున్నారేమోనని, శైలేంద్ర అంటాడు.

ఆ తర్వాత నీకేమవుతుందోనని భయపడ్డానని శైలేంద్ర టాపిక్ ని మారుస్తాడు. నిజంగానే భర్త మంచి వాడిగా మారిపోయాడని, ధరణి అనుకుంటుంది. రిషి ఆచూకి కోసం అతనికి తెలిసిన ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తుంది. కానీ రిషి రాలేదని వాళ్ళందరూ సమాధానం చెబుతారు. వసుధార భయపడుతుంది. అనుపమ కాఫీ తీసుకుని రిషి గురించి మహేంద్రని అడుగుతుంది. ఇప్పుడు నన్ను ఏమీ అడగద్దు. నేను నీకు సమాధానం చెప్పలేను అని సీరియస్ అవుతాడు. ఉదయం నుండి రిషి కనపడలేదని వసు కన్నీళ్ళతో అనుపమకి చెప్తుంది.

రిషి పంపించిన మెసేజ్ గురించి అనుపమకి చెప్తుంది వసుధార. ఆ మెసేజ్ రిషి పంపకపోయి ఉండొచ్చు అని అనుమాన పడుతుంది అనుపమ. వసుధార కంగారు పడుతుండే, నువ్వు కూల్ గా ఎందుకు ఉన్నావని మహేంద్ర తో అంటుంది. ఆమె మాటలకి ఒక్కసారిగా సీరియస్ అవుతాడు మహేంద్ర. వసుధార బయటికి కనపడుతోంది, నేను కనిపించట్లేదు అంతే అంటాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం మంచిదని అనుపమంటుంది. రిషి ఎక్కడికి వెళ్ళాడో వాళ్ళ ఇన్వెస్టిగేట్ చేసి చెప్తారని అంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now