Nani : విజ‌య్ దేవ‌ర‌కొండ – ర‌ష్మిక విష‌యంలో క్ష‌మాప‌ణ‌లు కోరిన నాని.. ఎందుకంటే..!

December 5, 2023 9:47 AM

Nani : న్యాచురల్ స్టార్ నాని పెద్ద‌గా వివాదాల జోలికి పోడు.ఒక‌వేళ ఆయ‌న‌ని ఏదైన వివాదం చుట్టుముట్టింది అంటే వెంట‌నే దానిపై క్లారిటీ ఇచ్చేస్తాడు. నాని హీరోగా హాయ్ నాన్న అనే సినిమా రూపొంద‌గా, ఈ చిత్రం డిసెంబ‌ర్ 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నాని జోడిగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తండ్రి కూతురు మధ్య ఉండే ఎమోషన్ నేపథ్యంలో ఈ సినిమాకు అడియన్స్ ముందుకు తీసుకువస్తుండగా.. ఇందులో మరోసారి తండ్రిగా కనిపించి అల‌రించ‌నున్నారు.

రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో రీసెంట్‌గా హైదరాబాద్ లో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.. అయితే ఈ వేడుకలో అనుహ్యంగా విజయ్, రష్మిక మార్ఫింగ్ ఫోటో స్క్రీన్ పై కనిపించింది. మాల్దీవ్స్ లో విజయ్ ఫోటోను.. అలాగే రష్మిక ఫోటోను ఒకేచోట ఉన్నట్లుగా ఎడిట్ చేసిన ఫోటో స్క్రీన్ పై రావడంతో నాని, మృణాల్ తోపాటు.. అక్కడున్నవారంతా అవాక్క‌య్యారు. వీరిద్దరూ మాల్దీవ్స్ కి వెళ్ళినప్పుడు వేరువేరుగా తీసుకున్న ఫోటోలను అప్పట్లో కొంతమంది సోషల్ మీడియా యూజర్స్ కలిపి ఒక ఫోటోగా చేయగా, ఆ ఫోటో నాని మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో విజయ్, రష్మిక అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nani responded on vijay deverakonda and rashmika mandanna issue
Nani

ఇలా చెయ్యడం చాలా చీప్ పబ్లిసిటీ ట్రిక్ అని ఏవేవో రాసేశారు. కాగా ఈ విషయంపై ఫైనల్ గా నాని స్పందించారు.హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ – రష్మికల ఫోటో అలా స్క్రీన్ పై వేయడం నిజంగా దురదృష్టకరం. ఆ ఫోటో చూసి మేము కూడా షాక్ అయ్యాం. అలాంటి ఈవెంట్స్ కోసం చాలా మంది వర్క్ చేస్తారు. అది ఎవరు చేసారో కూడా తెలీదు, వాళ్ళు ఎందుకు చేసారో కూడా తెలీదు. నేను, విజయ్, రష్మిక.. మేమంతా మంచి స్నేహితులమే. సినిమా ప్రమోషన్స్ లో అనుకోకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని వాళ్లకి కూడా తెలుసు. ఒకవేళ ఆ చర్య వాళ్ళ ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే ‘హాయ్ నాన్న’ టీం నుంచి క్షమాపణలు కోరుతున్నాను అని నాని అన్నారు. కాగా, నాని – రష్మిక కూడా గతంలో దేవదాస్ సినిమాలో కలిసి నటించారు. మ‌రి నాని క్లారిటీతో ఫ్యాన్స్ శాంతిస్తారో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now