Trisha : చెత్త వ్యాఖ్య‌లు చేయ‌కండి.. ఇదేమైన జాతీయ స‌మ‌స్య‌నా అంటూ త్రిష ఆగ్రహం

December 2, 2023 12:24 PM

Trisha : చెన్నై చంద్రం త్రిష గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అందాల భామ ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో కూడా చాలా సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించి అల‌రించంది. స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ ఇప్పుడు కోలీవుడ్‌కి ప‌రిమితం అయింది. రీసెంట్‌గా త్రిష పేరు ఎక్కువ‌గా వినిపించింది. ఆమెని రేప్ చేస్తాన‌ని మ‌న్సూర్ అలీ ఖాన్ కామెంట్ చేయ‌డంతో పెద్ద ఎత్తున త్రిష‌కి మ‌ద్ద‌తు ల‌భించింది. మ‌న్సూర్ కామెంట్ పై త్రిష కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో ఆయ‌న దిగొచ్చి క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. ఇక ఇదిలా ఉంటే త్రిష ఇప్పుడు 40 ఏళ్ల వ‌య‌స్సులో ఉన్న‌ప్ప‌టికీ కుర్ర‌భామ మాదిరిగానే ఉంది.

త్రిష వ‌య‌స్సు 40 ఏళ్లు దాట‌డంతో కొంద‌రు నెటిజ‌న్స్ ఆమెపై వ్యంగాస్త్రాలు చేస్తున్నారు. ఈ వ‌య‌స్సులో కూడా హీరోయిన్ గా త్రిష‌కి అవకాశాలు రావడంపై సోషల్ మీడియాలో కొంద‌రు ఆమెని ట్రోల్ చేస్తున్నారు. చాలా కాలం ఆ ట్రోల్స్ విన్న త్రిష స్పందించలేదు. కాని ఇప్పుడు గ‌ట్టిగా స‌మాధానం ఇచ్చింది.ఇప్పుడు నా వయసు జాతీయ సమస్యగా మారింది. నాకు నలభై నిండటంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన‌ట్టు ఉంది.. వీళ్లు రాసే రాతలు, వీడియోలు అలాగే ఉన్నాయి మరి. వేరే సమస్యే లేనట్టు చివరకు నా వయసు గురించి పిచ్చి రాతలు రాయడం.. సిగ్గనిపించడంలేదా?’ అంటూ కొన్ని ప్లాట్‌ఫాంస్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

Trisha angry reply to netizen
Trisha

‘బుద్ధిలేనివాళ్లు చేసే న్యూసెన్స్‌ ఇది. మొదట్లో పట్టించుకోకూడదనే అనుకున్నా. కానీ ఆగేలా లేవు. అందుకే మాట్లాడుతున్నా. భారతీయ సినీ పరిశ్రమలో 40 దాటిన కథానాయికలు చాలామంది ఉన్నారు. నేనే ప్రథమం కాదు. నాకు ఇప్పటికీ అవకాశాలు రావడం కొందరికి మింగుడుప‌డ‌డం లేద‌న్న‌ట్టుగా ఉంది అందుకే పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. నేను నటిని. చనిపోయేదాకా నటిస్తూనే ఉంటా. నటనకు వయసుతో నిమిత్తంలేదు. ఆ మాత్రం కామన్‌సెన్స్‌ లేకపోతే ఎలా? నా అందం, నా అభినయసామర్థ్యం నాకు గర్వకారణాలు’ అంటూ భావోద్వేగంగా త్రిష మాట్లాడింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now