Brahmanandam : ఓటు వేయ‌ని వారిని ఏమంటారంటూ బ్ర‌హ్మీకి మీడియా ప్ర‌శ్న‌.. ఆన్స‌ర్ ఏంటంటే..!

December 1, 2023 12:25 PM

Brahmanandam : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ స‌జావుగా సాగింది. ఈ ప్రజాస్వామ్య పండుగలో సాధార‌ణ ఓట‌ర్లతో పాటు సెల‌బ్రిటీలూ ఓటేసేందుకు పోటెత్తారు. సాధారణ పౌరుల్లా క్యూలో నిల్చొని మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద సినీతారల సందడి క‌నిపింఇంది. టాలీవుడ్‌ స్టార్స్‌ రామ్‌ చరణ్‌ – ఉపాసన దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా మహేశ్‌ బాబు – నమ్రత కూడా జూబ్లీహిల్స్‌లోని జూబ్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఓటు వేశారు. ప్రముఖ సీనియర్‌ నటుడు బ్రహ్మానందం, రాజశేఖర్‌, రామ్‌, స్టార్‌ షెట్లర్‌ పీవీ సింధు, యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

బ్రహ్మానందం తన సతీమణితో కలిసి హైదరాబాద్ లో తన ఓటు ఉన్న పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఓటేశారు. బ్రహ్మానందం రావడంతో పలువురు ఓటింగ్ వచ్చిన వాళ్ళు ఆయనతో ఫొటోలు దిగడానికి ఎంతో ఆసక్తి చూపించారు. బ్ర‌హ్మీ కూడా వారితో ఫొటోల‌కి ఫోజులిచ్చాడు. ఇక బ్రహ్మానందం ఓటేసిన అనంతరం మీడియా చుట్టుముట్టారు. మీడియా ప్రతినిధుల్లో పలువురు బ్రహ్మానందంని.. సర్, కొంతమంది ఓటేయడానికి రానివాళ్లు ఉన్నారు వాళ్ళని ఏమంటారు అని అడిగారు. దీనికి బ్రహ్మి కామెడీగా.. ఏమంటారు, ఓటు వేయని వాళ్ళు అంటారు అని చెప్పారు. దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వేశారు.

Brahmanandam funny reply to those who did not caste their votes
Brahmanandam

సాధార‌ణంగా బ్ర‌హ్మానందం ఫేస్ చూస్తేనే మ‌న‌కు తెగ న‌వ్వు వ‌స్తుంది. ఇక సీరియ‌స్‌గా జ‌రుగుతున్న ఎల‌క్ష‌న్స్ టైంలోను ఓటింగ్ దగ్గరికి వచ్చి కూడా తన కామెడీని చూపించడంతో ఈ బ్రహ్మానందం వీడియో వైరల్ గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో బోలెడన్ని సరదా మీమ్స్ వస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు పోలింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ కొనసాగింది. అయితే, సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్‌కు అధికారులు అనుమతించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now