కోవిడ్ వ‌ల్ల భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయా ? ఈ డిజిట‌ల్ ప‌రిక‌రాల‌ను ఇంట్లో ఉంచుకోండి.. సుర‌క్షితంగా ఉండండి..!

July 19, 2021 11:14 AM

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. గ‌త ఏడాదిన్న‌ర కాలంగా ఈ మ‌హ‌మ్మారి ఎప్పుడు అంతం అవుతుందా ? అని ఎదురు చూస్తున్నారు. మ‌రో వైపు కోవిడ్ రాకుండా అనేక జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తున్నారు. అయితే కింద తెలిపిన డిజిట‌ల్ ప‌రిక‌రాల‌ను ఇంట్లో ఉంచుకుంటే దాంతో కోవిడ్ నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. మ‌రి ఆ ప‌రిక‌రాలు ఏమిటంటే..

having covid fear then keep these digital gadgets in your home

1. ప‌ల్స్ ఆక్సీమీట‌ర్

దీని స‌హాయంతో ర‌క్తంలో ఆక్సిజ‌న్ స్థాయిలను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవ‌చ్చు. దీని ద్వారా రోజూ ప‌రీక్ష చేసుకోవాలి. కోవిడ్ ల‌క్ష‌ణాలు లేకున్నా ర‌క్తంలో ఆక్సిజ‌న్ స్థాయిలు త‌గ్గితే వెంట‌నే అల‌ర్ట్ అయి చికిత్స తీసుకోవ‌చ్చు. అందుక‌ని ఈ మీట‌ర్‌ను క‌చ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలి.

2. ఆక్సిజ‌న్ కాన్‌సన్‌ట్రేట‌ర్

ఆక్సిజ‌న్ కాన్‌సన్‌ట్రేట‌ర్ ఎమ‌ర్జెన్సీ స‌మ‌యాల్లో మ‌నకు ఆక్సిజ‌న్‌ను అందిస్తుంది. దీంతో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. ఇది ఈ-కామ‌ర్స్ సైట్ల‌లోనూ ల‌భిస్తుంది. క‌నుక కోవిడ్ నుంచి సుర‌క్షితంగా ఉండాలంటే దీన్ని కూడా ఇంట్లో ఉంచుకోవాలి.

3. డిజిట‌ల్ ఇన్‌ఫ్రారెడ్ థ‌ర్మామీట‌ర్

దీని స‌హాయంతో వ్య‌క్తుల‌ను ట‌చ్ చేయ‌కుండానే 2 లేదా 3 ఇంచుల దూరం నుంచే వ్య‌క్తి ఉష్ణోగ్ర‌త‌ను కొల‌వ‌చ్చు. జ్వ‌రం ఉందీ, లేనిదీ సుల‌భంగా తెలుస్తుంది. దీంతో జాగ్ర‌త్త‌గా ఉండ‌వ‌చ్చు. క‌నుక దీన్ని కూడా ఇంట్లో ఉంచుకోవ‌డం ఉత్త‌మం.

4. డిజిట‌ల్ బీపీ మానిట‌ర్

ప‌ల్స్, బీపీల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. క‌నుక ఈ మీట‌ర్‌ను కూడా ఇంట్లో ఉంచుకోవ‌డం శ్రేయ‌స్క‌రం.

5. డిజిట‌ల్ గ్లూకో మీట‌ర్

దీని వ‌ల్ల ఎప్ప‌టిక‌ప్పుడు షుగ‌ర్ లెవ‌ల్స్ ను చెక్ చేసుకోవ‌చ్చు. కోవిడ్ స‌మ‌యంలో ఇది ఎంత‌గానో ప‌నిచేస్తుంది. అసాధార‌ణ రీతిలో షుగ‌ర్ లెవ‌ల్స్ ఉంటే వెంట‌నే తెలిసిపోతుంది. జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. దీన్ని కూడా ఇంట్లో ఉంచుకోవాలి.

ఈ ప‌రికరాల‌న్నింటినీ ఇంట్లో పెట్టుకోవ‌డం ద్వారా కోవిడ్ స‌మ‌యంలో మ‌నం మ‌న ఆరోగ్యాల‌ను సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now