Micro Greens : వీటిని తింటే జీవితంలో ఏ జబ్బు రాదు.. ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకుని తినవ‌చ్చు..!

December 4, 2023 5:28 PM

Micro Greens : అనారోగ్య సమస్యల కారణంగా, చాలామంది ఇబ్బంది పడుతుంటారు. నిజానికి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి, ఇంటి చిట్కాలను పాటిస్తే చాలా మంచి జరుగుతుంది. మైక్రో గ్రీన్స్ మీద, ఈ రోజుల్లో చాలా మందికి అవగాహన పెరిగింది. ఎక్కువ మంది వాడుతున్నారు. సూక్ష్మ పోషకాలు ఇందులో అద్భుతంగా ఉంటాయి. పోషకాలు గని ఇది అని కూడా చెప్పొచ్చు. సూక్ష్మ పోషకలని తక్కువ ఆహారంలో ఎక్కువ అందించే విధంగా మైక్రోగ్రీన్స్ తయారవుతాయి. మొలకెత్తిన విత్తనాలు తిన్నప్పుడు, ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. మొలకలు కట్టే విధానంలోనే ఇంకొక రెండు మూడు రోజులు పాటు ఉంచి, పైన కాస్త నీళ్లు చిలకరిస్తూ ఉండాలి.

మైక్రో గ్రీన్స్ ని తయారు చేసేటప్పుడు నీడ లో పెట్టాలి. కాస్త గాలి వెలుతురు తగిలేటట్టు ఉంచుకోవాలి. ఈ మొక్కకి పైన ఆకులు వస్తాయి. ఇలా రెండు మూడు ఆకులు వచ్చినట్లయితే మైక్రో గ్రీన్స్ అంటారు. ఈ మైక్రో గ్రీన్స్ ని మనం సహజంగా తినగలిగినట్లయితే, పోషకలోపం ఏమీ ఉండదు. విటమిన్స్, మినరల్స్ బాగా అందుతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యకి మందులు వేసుకోవాల్సిన పని కూడా ఉండదు.

Micro Greens health benefits in telugu you make them at home
Micro Greens

మైక్రో గ్రీన్స్ నిఇళ్లల్లో ఈజీగా పెంచుకోవచ్చు. చిన్న చిన్న ట్రేల్లో వేసి మైక్రో గ్రీన్స్ ని తయారు చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే ఆ పద్ధతిలో మీరు పెంచుకోవచ్చు. తోటకూర విత్తనాలని వాడొచ్చు. కొత్తిమీర విత్తనాలను వాడచ్చు. బొబ్బర్లు కూడా వాడొచ్చు.

ఈ విత్తనాలు తీసుకుని, మీరు వేసినట్లయితే నాలుగు ఐదు రోజులకే చక్కగా ఆకులు వస్తాయి. వీటన్నిటిని కూడా తిన్నట్లయితే, చక్కటి పోషకాలు అందుతాయి. అనారోగ్య సమస్యలు మీ దరి చేరవు. మల్టీ గ్రైన్ పిండిలో కొంచెం ఈ ఆకులు వేసేసి చపాతీలు చేసుకుని తింటే మంచిది. ఇలా తినలేకపోతే మీకు నచ్చిన విధంగా మీరు తినొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now