గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై ఆ నిబంధనలు లేవు!

July 18, 2021 4:18 PM

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ విషయంలో ఉన్నటువంటి నిబంధనలను సడలించింది.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి ఊరట కలగనుంది.ఈ నిర్ణయం వల్ల ఉపాధి పనులకు వెళ్లిన వారు ఏ ప్రాంతంలో అయిన ఎంతో సులభతరంగా గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు.

ఇదివరకే మన కుటుంబంలో ఒక గ్యాస్ సిలిండర్ ఉంటే దాని ద్వారా కొత్త గ్యాస్ సిలిండర్ కనెక్షన్ పొందే అవకాశాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కల్పించింది. ఒకవేళ మీరు ఏదైనా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో గ్యాస్ కనెక్షన్ పొందాలంటే ఇది వరకు ఎన్నో అవస్థలు పడే వారు. ఇకపై ఇలాంటి కష్టాలకు ఇండియన్ గ్యాస్ చెక్ పెట్టనుంది.

మీరు ఏ ప్రాంతంలో ఉన్న మీకు ఇది వరకే గ్యాస్ కనెక్షన్ ఉంటే దాని ఆధారంగా కొత్త కనెక్షన్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇది కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం కేవలం ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఫ్యామిలీ గ్యాస్ కనెక్షన్ వివరాలు, మీ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వటం వల్ల కొత్త గ్యాస్ కనెక్షన్ ఎంతో సులభంగా పొందవచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎంతో మంది వినియోగదారులకు ఊరట కలిగిస్తుందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now