Sreeleela : శ్రీలీలకి భ‌ర్త కావాల‌ని అనుకుంటున్నారా.. అయితే ఈ క్వాలిటీస్ మీలో ఉన్నాయో లేదో చూసుకోండి..!

November 27, 2023 5:21 PM

Sreeleela : శ్రీలీల‌.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన శ్రీలీల సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత శ్రీలీల హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్ద హిట్ కావ‌డంతో శ్రీలీలకి వ‌రుస అవ‌కాశాలు వ‌స్తున్నాయి. స్కంద, భగవంత్ కేసరి,వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. మహేష్ బాబు ‘గుంటూరు కారం, పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ , నితిన్‌ ‘ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్’, విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.

అయితే ఇటీవ‌ల ఆదికేశవ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది శ్రీలీల‌. ఈ మూవీకి సంబంధించి ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇచ్చిన శ్రీలీల తాజాగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి? అతనికి ఉండాల్సిన క్వాలిటీలు ఏంటి? తదితర అంశాలను సరదాగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది . ‘ నన్ను చేసుకోబోయేవాడికి ముచ్చటగా మూడు లక్షణాలుండాలి. అవి కూడా చాలా సింపుల్‌ లక్షణాలు. అందులో మొదటిది.. కొన్ని విషయాల్లో నన్ను భరించడం చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భావించాలి.. భరించాలి. రెండు.. అతనికి చక్కని హాస్య చతురత ఉండాలి. సెన్సాఫ్‌హ్యూమర్‌తో నవ్వించేవాడైవుండాలి. మూడు.. కాస్త ఫ్యామిలీ టైప్‌గా పద్దతిగా అందంగా ఉండాలి. అంతే సింపుల్‌.. ఈ మూడు గుణాలు ఉంటే చాలు. అత‌డిని నేను పెళ్లి చేసుకుంటానంటూ శ్రీలీల చెప్పుకొచ్చింది.

Sreeleela wants these qualities in her husband
Sreeleela

మ‌రి ఈ అమ్మ‌డికి అలాంటివాడు ఎక్క‌డైనా తారసపడ్డాడా? అని అడిగితే ‘లేదు.. ఒక వేళ కనిపించినా కాన్సన్‌ట్రేట్‌ చేసేంత టైమ్‌ నాకులేదు. నేను బిజీ..’ అంటూ శ్రీలీల ఆస‌క్తిక‌ర కామెంట్ చేసింది. ఇక కుర్రాళ్ళలో శ్రీలీలకు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. శ్రీలీల ఎనర్జీ, డాన్సులకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. శ్రీలీలను ఆరాధించే అభిమానులు ఉన్నారు. శ్రీలీల‌కి ఇటీవల వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రిస్తున్నాయి. మ‌రో మంచి హిట్ కోసం ఈ అమ్మ‌డు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now