Jabardasth Naresh : రెండేళ్లు సీక్రెట్ ల‌వ్ న‌డిపిన జ‌బ‌ర్ధ‌స్త్ న‌రేష్‌.. ఎట్ట‌కేల‌కి ప్రేమ‌ని బ‌య‌ట‌పెట్టాడుగా..!

November 27, 2023 3:43 PM

Jabardasth Naresh : జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నవారిలో న‌రేష్ ఒక‌రు. అత‌ను చూడ‌డానికి చిన్న‌గా క‌నిపిస్తాడు కాని ఆయ‌న వేసే పంచ్ లు, డైలాగులు మాత్రం కేక పెట్టించే విధంగా ఉంటాయి. మ‌న‌ల్ని క‌డుపుబ్బ న‌వ్వించే న‌రేష్ జీవితంలో ఎన్నో క‌ష్టాలు ఉన్నాయి. న‌రేష్ పుట్టిన సమయంలోనే డాక్టర్లు బ్రతకరని చెప్పారు. చాలా రోజులు ఆయనను వెంటిలేషన్ పైనే ఉంచారట. అలా మెల్లిగా క్యూరైన నరేష్, ప్రస్తుతం పదిమందిని నవ్వులతో బ్రతికిస్తున్నాడు. అలాంటి నరేష్ జబర్దస్త్ షో ద్వారా జబర్దస్త్ నరేష్ గా మారారు. జ‌నగామ జిల్లాకు చెందిన నరేష్, చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో సినిమాల కోసం ప్రయత్నాలు చేశాడు.

నరేష్ కోసం ఏకంగా తన కుటుంబం హైదరాబాద్ కు వచ్చేసింది. సినిమాల్లో చాన్సులు రాకపోవడంతో నిరాశ చెందలేదు. కానీ ఓసారి ఢీ షో కి సంబంధించి అడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. కానీ అందులో సెలెక్ట్ కాలేదు. ఓసారి జ‌బ‌ర్ధ‌స్త్‌లో ఆడిష‌న్స్ జ‌రుగుతున్నాయ‌ని తెలిసి అక్క‌డ‌కి వెళ్లిన న‌రేష్‌కి గాలిపటాల సుధాకర్ ఆకర్షితుడై బుల్లెట్ భాస్కర్ కి పరిచయం చేశాడు. ఆ విధంగా చలాకి చంటి మొదటిసారి నరేష్ కి అవకాశం ఇచ్చాడు. అత‌డికి పెళ్లైంద‌ని, ఆయ‌న భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌నే టాక్ కూడా నడిచింది. అయితే తాజాగా న‌రేష్ త‌న ప్రేయ‌సిని ప‌రిచ‌యం చేసి షాకిచ్చాడు.

Jabardasth Naresh finally introduced her after 2 years of waiting
Jabardasth Naresh

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రెండేళ్ల‌పాటు చాలా సీక్రెట్‌గా మెయింటేన్‌ చేశాను. నాకూ ఒక లవర్‌ ఉంది అని చెబుతూ తన ప్రియురాలిని స్టేజ్‌పైకి ఆహ్వానించారు. ఇక ఆమె రావ‌డంతో ఇద్ద‌రు డ్యూయ‌ట్ వేసుకున్నారు. ఇక న‌రేష్ ప్రియురాలు మాట్లాడుతూ అత‌ను మాటల్లో చెప్పలేనంత లవ్‌ చేశారు. అంతటి ప్రేమనిచ్చాడు ఈ రెండేళ్లలో అని తెలిసింది అని పేర్కొంది..ఇక నరేష్‌.. స్టేజ్‌పైనే ఆమెకి గులాబీ పువ్వు ఇస్తూ లవ్‌ని ప్రపోజ్‌ చేశాడు. ఇక హార్ట్ బెలూన్, రోజాపువ్వు తీసుకుని అత‌నికి ముద్దు పెట్టింది నరేష్ ప్రియురాలు. ఇక షోకి న‌రేష్ తండ్రి కూడా హాజ‌రు కాగా, ఆయ‌న పాదాలకి వారిద్ద‌రు న‌మ‌స్క‌రించి ఆశీస్సులు తీసుకున్నారు. మ‌రి ఇది నిజ‌మా లేదా తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now