Lakshmi Devi Blessings : ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం కావాలంటే.. ఈ వాస్తు చిట్కాల‌ను పాటించండి..!

December 1, 2023 12:22 PM

Lakshmi Devi Blessings : ప్రతి ఒక్కరు కూడా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, ధనవంతులు అయిపోవాలని, అనుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం అంత సులభం కాదు. లక్ష్మీదేవి మన వెంట కొలువై ఉండాలంటే, కచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడం కోసం, కొన్ని వాస్తు చిట్కాలని పాటించాలి. కొంతమంది, ఇళ్లల్లో ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలవదు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి నివసించే ఇల్లు, ప్రతికూల శక్తితో నిండి ఉంటే, లక్ష్మీ దేవి ఉండదు. వాస్తు ప్రకారం, కొన్ని విషయాలను పాటించడం వలన, సానుకూల శక్తిని పెంచవచ్చు.

సంపదకి దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆర్థిక స్థితి కూడా మెరుగు పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఏం చేయాలి అనేది చూద్దాం ప్రతిరోజు సాయంత్రం ఆవనూనె దీపాన్ని వెలిగించి, అందులో రెండు లవంగాలని వెయ్యాలి. ఈ దీపాన్ని తలుపుకి రెండు పక్కల పెట్టాలి. ఇలా చేయడం వలన, లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది. కర్పూరం మంచి సువాసనతో ఉంటుంది.

follow these vastu tips for Lakshmi Devi Blessings
Lakshmi Devi Blessings

దీపారాధన, హారతి ఇవ్వడం పూజలో ముఖ్యమైనవి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగి పోవాలంటే, కర్పూరన్ని వెలిగించాలి. కర్పూరాన్ని వెలిగించి, అందులో రెండు లవంగాలు వేస్తే, ఆ ఇంట్లో మంచి సువాసన రావడమే కాకుండా, లక్ష్మీదేవి స్థిరపడుతుంది. ఐశ్వర్యం కలుగుతుంది.

గోమాత కి రోజూ ఆహారాన్ని తినిపిస్తే కూడా మంచిది. దేవతల ఆశీర్వాదం ఉంటుంది. అలానే, లక్ష్మీ దేవి ఇంట్లో ఉండాలంటే, పక్షుల కి రోజూ ఆహారం వేయండి. ఇలా చేయడం వలన, జీవితం లో మంచి పురోగతి, శ్రేయస్సు ఉంటుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత, అస్సలు ఇంటిని శుభ్రం చేయకండి. అలా చేయడం వలన, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. పేదరికం ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now