Ileana : ఇత‌డే నా భ‌ర్త‌.. ట్రోల‌ర్స్‌కి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన ఇలియానా

November 26, 2023 9:36 AM

Ileana : గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు త‌న అంద‌చందాలతో పాటు క్యూట్‌నెస్‌తో కుర్ర‌కారు మ‌న‌సులు దోచుకుంది ఇలియానా. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఈ కరెంటు తీగ.. ఆ తర్వాత అద్భుమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.. టాలీవుడ్ స్టార్ అండ్ యంగ్ హీరోల అందరి సరనస నటించిన ఈ ముద్దుగమ్మ రాను రాను కెరీర్ స‌రిగ్గా మ‌ల‌చుకోలేక‌పోయింది. ఈ అమ్మ‌డు చివరగా మాస్ మహారాజా రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో క‌నిపించింది. కొద్ది రోజుల క్రితం ఇలియానా పెళ్లి మాట చెప్పకుండానే ప్రెగ్నెన్సీ సంగతి చెప్పి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారు.

తన బాబు పేరుని, ఫేసుని రివీల్ చేసిన ఇలియానా.. బాబు తండ్రి ఎవరు అన్న విషయంలో మాత్రం సస్పెన్స్ మెయిన్‌టైన్ చేస్తూ వ‌చ్చింది. అయితే ఈ విష‌యంలో కొంద‌రు ఇలియానాని ట్రోల్ చేశారు . ఈ నేప‌థ్యంలో సస్పెన్స్ కి ఇప్పుడు తెరదించారు. తన భర్త ఎవరో అందరికి తెలియజేశారు. రీసెంట్ గా ఇలియానా సోషల్ మీడియా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈక్రమంలోనే ఆమె తన భర్త ఎవరో అందరికి తెలియజేశారు. గ‌తంలో ‘డేట్ నైట్’ అంటూ ఒక వ్యక్తితో ఉన్న ఫోటోలను ఈ భామ షేర్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే అప్పుడు అతనే తన భర్త అని ఆమె నేరుగా చెప్ప‌లేదు కాని కొంత స‌స్పెన్స్ అయితే మెయింటైన్ చేసింది.

Ileana finally introduced her husband
Ileana

తాజాగా ఆ వ్యక్తే తన భర్త అని తెలియజేశారు. మీ సింగల్ పేరెంటింగ్ ఎలా ఉంది..? అని ఒక నెటిజెన్ క్యూస్షన్ చేసిన ప్రశ్నకు బదులిస్తూ.. తాను సింగల్ పేరెంట్ కాదని తెలియజేస్తూ తన కొడుకుకి తండ్రి ఎవరు అన్నది తెలియజేశారు. దీంతో ఇలియానా భర్త ఎవరు అన్న క్యూస్షన్ కి ఆన్సర్ దొరికేసినట్లు అయ్యింది. త్వరలోనే మళ్ళీ సినిమాలోకి తిరిగి వస్తానని, ప్రస్తుతం అమ్మగా తన భాద్యతలు నిర్వర్తిస్తున్నట్లు ఇలియానా చెప్పుకొచ్చింది. అమ్మ‌డు చెప్పిన స‌మాధాన‌ల‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. . ఈ సమాధానాలతో ఆమె అభిమానులు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే ఇలియానా పెళ్లాడిన ఈ వ్యక్తి ఎవరు..? అతను ఏం చేస్తారు..? అనేది మాత్రం ఇప్ప‌టికీ స‌స్పెన్స్‌గానే ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now