Vastu Tips : వాస్తు ప్ర‌కారం ఇంట్లో ఈ వ‌స్తువుల‌ను పెట్టండి.. ల‌క్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది..!

November 22, 2023 3:48 PM

Vastu Tips : ప్రతి ఒక్కరు కూడా, వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం మనం అనుసరించడం వలన, అంతా మంచే జరుగుతుంది. ఎటువంటి సమస్యలు అయినా కూడా తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ విషయాలను కనుక ఆచరించినట్లయితే, అంతా మంచి జరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని విషయాలని పాటిస్తే, ఆర్థిక ఇబ్బందులు ఉండవు. సంతోషంగా ఉండొచ్చు. అనారోగ్య సమస్యలు వంటివి కూడా వాస్తు ప్రకారం మనం పాటించడం వలన తొలగించుకోవచ్చు. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. ఇంట్లో వీటిని పెట్టుకున్నట్లైతే, కచ్చితంగా ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు. మరి ఏ బాధలు లేకుండా ఉండాలంటే, వేటిని ఇంట్లో పెట్టుకోవాలి అనే విషయాన్ని చూద్దాం.

మెటల్ ఏనుగు ఇంట్లో ఉంటే, చాలా మంచిది. సంపద పెరుగుతుంది. కాబట్టి, లోహంతో తయారు చేసిన ఏనుగు బొమ్మని ఇంట్లో పెట్టుకోండి. మెటల్ తాబేలు కూడా ఇంట్లో ఉండడం మంచిది. పాజిటివ్ ఎనర్జీ ని ఇది తీసుకువస్తుంది. గుర్రపు డెక్క ఇంట్లో ఉంచుకుంటే కూడా ప్రతికూల శక్తి తొలగిపోతుంది. గుర్రపు డెక్కని ఇంట్లో పెట్టుకుంటే, ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి.

Vastu Tips keep these items in your home for wealth
Vastu Tips

లాకర్ లో గుర్రపు డెక్కని పెట్టుకుంటే మంచిది. అదేవిధంగా, ఒక లాఫింగ్ బుద్ధాని కూడా ఇంట్లో పెట్టుకోండి. ఇది కూడా శుభప్రదం. ఇంట్లో దీనిని ఉంచడం వలన ఐశ్వర్యం పెరుగుతుంది. ధనానికి అస్సలు లోటు ఉండదు. జీవితాంతం ఆనందంగా ఉండడానికి కూడా అవుతుంది.

వాస్తు ప్రకారం లక్ష్మీదేవికి ఇష్టమైన శంఖం కూడా ఇంట్లో పెట్టుకోవడం మంచిది. శంఖం ఇంట్లో ఉంటే కూడా ఆర్థిక బాధలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. చూశారు కదా ఎటువంటి వాటిని ఇంట్లో పెట్టుకుంటే, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని. ధనవంతుల అవ్వాలనుకుంటే, ఈసారి కచ్చితంగా వీటిని పాటించండి. ఆర్థిక బాధల నుండి దూరంగా ఉండండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now