Bhagavanth Kesari Uyyalo Uyyala Video Song : భ‌గవంత్ కేస‌రి ఉయ్యాలో ఉయ్యాలా ఫుల్ వీడియో సాంగ్‌పై ఓ లుక్కేయండి..!

November 19, 2023 8:03 PM

Bhagavanth Kesari Uyyalo Uyyala Video Song : నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో అనీల్ రావిపూడి తెర‌కెక్కించిన చిత్రం భ‌గ‌వంత్ కేస‌రి. ఈ చిత్రం బాల‌య్య‌కి మ‌రో మంచి విజ‌యం అందిచింది. మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వ‌చ్చిన ఈ చిత్రం అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. మొత్తంగా రూ.125 కోట్ల మేర గ్రాస్.. రూ.69 కోట్ల మేర షేర్ వసూలు చేసింది. విడుదలైన అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ చేసేసిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. దీంతో వరుసగా మూడో క్లీన్ హిట్‌ను బాలయ్య అందించారు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ విజయాలతో హ్యాట్రిక్ కొట్టారు బాలయ్య. ఇది నిజంగా నందమూరి అభిమానులు పండగ చేసుకునే విషయం.

ఈ చిత్రం నుండి తాజాగా హార్ట్ ట‌చింగ్ మెలోడీ ఉయ్యాలో ఉయ్యాలా అనే సాంగ్‌ ఫుల్ వీడియోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఉడతా ఉడతా హుష్షా హుష్‌.. సప్పుడు సేయకుర్రీ.. నీ కన్నా మస్తుగ ఉరుకుతాంది మా సిట్టి సిన్నారీ’ ఉయ్యాలో ఉయ్యాలా.. అంటూ తెలంగాణ భాష, యాసలో సాగిన ఈ పాటను అనంతశ్రీరామ్‌ లిరిక్స్ అందించ‌గా.. యస్‌.పి.చరణ్‌ ఆలపించారు. తమన్‌ స్వరాలందించాడు. సాంగ్‌ ఫుల్ వీడియోను న‌వంబ‌ర్ 04 న విడుద‌ల చేసిన‌ట్లు ప్ర‌క‌టించ‌గా, ఈ పాట విడుద‌ల చేసిన కొద్ది సేప‌టికే మ‌ళ్లీ ఆ వీడియోను యూట్యూబ్‌ నుంచి డిలీట్ చేశారు. తాజాగా ఫుల్ సాంగ్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఈ వీడియోని మీరు చూసి ఎంజాయ్ చేయండి.

Bhagavanth Kesari Uyyalo Uyyala Video Song released watch now
Bhagavanth Kesari Uyyalo Uyyala Video Song

భగవంత్ కేసరి’ మూవీకి నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్‌ జరిగింది. నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలతో హిట్లు కొట్టారు. ఈ క్రమంలోనే ‘భగవంత్ కేసరి’తో ఆయన హ్యాట్రిక్‌ను నమోదు చేసుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now