Trisha : త్రిష‌పై న‌టుడి అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు.. దీటుగా బ‌దులిచ్చిన న‌టి..!

November 19, 2023 5:23 PM

Trisha : చెన్నై చంద్రం త్రిష గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో న‌టించి వైవిధ్య‌మైన న‌ట‌న‌తో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన అందాల ముద్దుగుమ్మ త్రిష‌. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డికి తెలుగులో అవ‌కాశాలు త‌గ్గిన కూడా త‌మిళంలో మాత్రం మంచి అవ‌కాశాలు ద‌క్కించుకుంటుంది. రీసెంట్‌గా త్రిష లియో అనే చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న న‌టించింది. ఇందులో త్రిష న‌ట‌న‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. ఇక కీల‌క పాత్ర‌లో కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ న‌టించారు. అయితే చిత్రం మంచి విజ‌యం సాధించిన నేప‌థ్యంలో మ‌న్సూర్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఇంట‌ర్వ్యూలో త్రిష‌పై దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

నేను త్రిషతో నటిస్తున్నానని విన్నప్పుడు, సినిమాలో బెడ్‌రూమ్ సన్నివేశం ఉంటుందని అనుకున్నాను. ఆమెను చేతులతో ఎత్తుకుని బెడ్‌రూమ్‌కి తీసుకెళ్లవచ్చని భావించాను. కాని కాశ్మీర్ షెడ్యూల్‌లో సెట్స్‌లో అసలు త్రిషను నాకు చూపించనే లేదు అంటూ వెకిలి న‌వ్వులు న‌వ్వుతూ త‌న చేష్ట‌ల‌తో అంద‌రికి చిరాకు తెప్పించాడు. మన్సూర్‌పై ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు దుమ్మెత్తిపోశారు. అవమానకరంగా, స్త్రీద్వేషంతో కూడిన అసహ్యకరమైన మాటలుగా, జుగుప్సాకరంగా ఉన్నాయి అంటూ అత‌డి వ్యాఖ్య‌ల‌పై త్రిష కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

Trisha strong reply to mansur ali khan comments
Trisha

అతని లాంటి దారుణమైన వ్యక్తితో స్క్రీన్ స్పేస్‌ను ఇంతకాలం పంచుకోనందుకు నేను కృతజ్ఞురాలిని, నా మిగిలిన సినిమా కెరీర్‌లో కూడా అతనితో నటించకుండా చూసుకుంటాను. ఇలాంటి నీచ‌మైన వ్య‌క్తి మ‌గ‌జాతికి మ‌చ్చ తెచ్చేలా ఉన్నాడంటూ త్రిష తెలియ‌జేసింది. మ‌న్సూర్‌పై చిన్మయి శ్రీపాద కూడా దారుణంగా మండిప‌డింది. ఇలాంటి మనుషులు ఎప్పుడూ ఇలానే మాట్లాడుతుంటారు.. డబ్బు, అధికారం ఇలాంటివి చూసుకునే ఇలా నీచంగా అస‌హ్యంగా మాట్లాడ‌తారంటూ మండిప‌డింది. మలయాళ నటి మాళవిక మోహన్, దర్శకుడు లోకేష్ కానగరాజ్వంటి ప్ర‌ముఖులు కూడా అత‌నిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now