Sitara Ghattamaneni : సితార స్టైలిష్ లుక్స్.. చూస్తుంటే స్టార్ హీరోయిన్ కావ‌డం ఖాయం అనిపిస్తుందిగా..!

November 19, 2023 3:21 PM

Sitara Ghattamaneni : మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. న్న వయసులోనే పీఎంజే జ్యుయలర్స్ అనే ఆర్మమెంట్స్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా నియమితులై అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.. అయితే, ఈ వాణిజ్య ప్రకటనలో నటించడం ద్వారా తనకు వచ్చిన తొలి పారితోషికాన్ని ఛారిటీకి ఇచ్చానని సితార చెప్పారు. సితార మంచి మ‌న‌సుపై ప్ర‌తి ఒక్క‌రు ప్రశంస‌లు కురిపించారు. ఇక సితార టీనేజీలోకి అడుగు పెట్టేస్తోంది. మరి కొన్నేళ్లలో హీరోయిన్ గా తెరపై కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఇప్పటికే హీరోయిన్ ఫీచర్స్ తో మెరిసిపోతోంది. తాజాగా సోష‌ల్ మీడియాలో సితార పిక్స్ చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా వాటిని చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందని తెలిసిందే. తాజాగా ఇలా స్టైలిష్ ఫొటోలు పోస్ట్ చేసింది సితార. ఇది చూసిన వారు సితార అతి త్వ‌ర‌లోనే స్టార్ హీరోయిన్ కావ‌డం ఖాయం అని అంటున్నారు. సితార అందంలోనే కాదు గుణంలో కూడా తండ్రి పోలికే. మహేష్ బాబు చాలా కాలంగా పేద చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్స్ చేయిస్తుండ‌గా, సితార కూడా చిన్నతనంలోనే పేదలకు సహాయం చేయాలనే గుణం అలవరుచుకుంది. సితార తన వీడియోలతో పాటు, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది.

Sitara Ghattamaneni latest photos viral
Sitara Ghattamaneni

హీరోగా మహేష్ బాబు ఎంత పాపులర్ అయ్యాడో ..ఆయన కూతురు,గారాల పట్టి సితార ఘట్టమనేని కూడా అంతే… పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో సితార ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. సితార డాన్స్ నేర్చుకుంటుంది. యాని మాస్టర్ సితార గురువు కాగా, యాని మాస్టర్ తో డాన్స్ చేస్తూ వీడియోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి.. సితారకు నటనపై మక్కువ ఉందని ఇప్ప‌టికే అర్ధ‌మైంది.. ఆల్రెడీ ఆమె సర్కారు వారి పాట చిత్రంలో ప్రమోషనల్ వీడియోలో నటించింది. అతి త్వ‌ర‌లోనే సితార వెండితెర‌పై మెర‌వ‌నుందని అర్ధ‌మ‌వుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now