Prabhas Sreenu : మిమ్మ‌ల్ని ప్ర‌భాస్ తిట్టాడా.. ఇద్ద‌రికి చెడిందా అనే దానిపై ప్ర‌భాస్ శ్రీను కామెంట్స్..

November 18, 2023 1:46 PM

Prabhas Sreenu : నటుడు, కమెడియన్ ప్రభాస్ శ్రీను ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కులని ఎంత‌గానో అల‌రించారు. ఆయ‌న‌ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్ళు అయింది. ఇప్పటికే 300 పైగా సినిమాలు చేసిన శీను ఒక స్టార్ హీరో రేంజ్ ప్రభాస్ తో చాలా క్లోజ్ ఎలా అయ్యారు. ప్ర‌భాస్‌పై ఇష్టంతో ప్ర‌భాస్ శీనుగా మారారు. శ్రీను కెరీర్‌ ప్రారంభించి దాదాపు 20 ఏళ్లు పూర్తయ్యాయి. ‘వర్షం’, ‘చక్రం’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘డార్లింగ్‌’, ‘పౌర్ణమి’ తదితర చిత్రాల్లో ప్రభాస్‌తో కలిసి నటించారు. ఇద్దరి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. అయితే ఇటీవ‌ల ప్ర‌భాస్‌కి, శీనుకి మ‌ధ్య విబేధాలు వ‌చ్చిన‌ట్టు ప్ర‌చారాలు సాగాయి.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శ్రీను. ఆయన ఏ విషయంలోనూ సలహా ఇవ్వరని, ‘నువ్వెంటో ముందు తెలుసుకో.. దానిని బట్టి ముందు అడుగు వెయ్యి’ అని మాత్రమే చెబుతారు’ అని అన్నారు. ఇద్దరి మధ్య దూరం పెరిగిందనీ, ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభాస్‌ శ్రీను స్పందించారు. మా మధ్య అలాంటిది ఏమీ లేదని , మా స్నేహం నదీ ప్రవాహంలా సాగుతుందని చెప్పారు. సాధార‌ణంగా ప్ర‌భాస్ ఎవ‌రికి స‌లహా ఇవ్వ‌రు. అలా చేస్తే భయంతో పనిచేస్తార‌ని, అలా చేయడం సరైందికాదని ప్రభాస్‌ నాకు ఎక్కువ‌గా చెబుతూ ఉంటార‌ని శీను అన్నాడు.

Prabhas Sreenu sensational comments on him
Prabhas Sreenu

ప్ర‌భాస్‌కి న‌చ్చ‌ని చాలా అల‌వాట్లు మార్చుకున్నాం. మా స్నేహం న‌దీ ప్ర‌వాహంలా సాగుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేము వ‌రుస సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాం. ఇతరుల మాట విని ప్రభాస్‌ మీపై కోప్పడిన సందర్భాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు తనకెప్పుడూ అలా అనిపించలేదని అన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ శీను చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇక ప్రస్తుతం ప్రభాస్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో నటించిన ‘సలార్‌ పార్ట్‌ 1’ డిసెంబరు 22న విడుదల కానుంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’, మారుతి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇవి పూర్తయ్యాక సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో ఓ సినిమా చేయ‌నున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now