Guppedantha Manasu November 18th Episode : దేవయానిని కలిసిన అనుపమ.. మహేంద్ర మీద అబద్దాలు.. వసుధార వల్లే ఇలా జరిగిందని నేరం నెట్టేసిన శైలేంద్ర..!

November 18, 2023 8:37 AM

Guppedantha Manasu November 18th Episode : అనుపమ కాలేజీకి వస్తుంది. అక్కడున్న లెక్చరర్లను మహేంద్ర గురించి అడుగుతుంది. జగతి మేడం చనిపోయినప్పటి నుండి, సర్ చాలా డిస్టర్బ్ అయ్యారు. కాలేజ్ కి రావట్లేదు అని చెప్తారు. జగతి ఫ్రెండ్ ని నేను. అసలు ఆమె ఎలా చనిపోయిందని అనుపమడుగుతుంది. కాలేజీలోకి వచ్చిన శైలేంద్ర అనుపమని చూసి, షాక్ అయిపోతాడు. అనుపమ ఫోటోని దేవయానికి పంపిస్తాడు. తర్వాత రిషి వసుధారని కలుస్తానని అనుపమ వెళుతుంది. ఆమె ఎవరు, ఏమి అడిగిందని లెక్చరర్స్ ని శైలేంద్ర అడుగుతాడు. దీంతో దేవయానికే కాల్ చేసి, అనుపమ వచ్చినట్లు చెప్తాడు.

శైలేంద్ర తనను ఎలా అయినా ఏదో ఒకటి చేసి, ఇంటికి తీసుకురమ్మని దేవయాని చెప్తుంది. అలాగే అని శైలేంద్ర చెప్తాడు. ఎవరు మీరు అని శైలేంద్ర అడిగితే, మహేంద్ర కోసం వచ్చానని అనుపమంటుంది. బాబాయ్ ని కలవడానికి వచ్చారా అని పరిచయం చేసుకుంటాడు శైలేంద్ర. దేవయానికి ఫోన్ చేసి అనుపమ వచ్చినట్లు చెప్తాడు. దేవయాని మాట్లాడుతుంది. జగతి నీ గురించే చెబుతూ ఉండేది. ఇంటికి రా అనుపమ అని అంటుంది. నిన్ను చూడాలని ఉంది అని కూడా అంటుంది. జగతి గురించి చాలా విషయాలు చెప్పాలని దేవయాని అంటుంది వీలుంటే చూస్తాను అని అనుపమ అంటుంది.

ఎలాగైనా తనని తీసుకురమ్మని శైలేంద్ర కి చెప్తుంది. రిషి వసుధారాలని కలవాలని అనుపమ చెబితే మీటింగ్ ఉందని, లంచ్ తర్వాత వస్తారని అటెండర్ తో చెప్పిస్తాడు శైలేంద్ర. అనుపమ ని శైలేంద్ర తీసుకువెళ్తుండగా రిషి వసుధార చూస్తారు. అది చూసి వాళ్ళని చూడనివ్వకుండా, జగతి ఫోటో దగ్గరికి తీసుకెళ్తాడు శైలేంద్ర. ప్రతిరోజు కాలేజీకి వచ్చి పిన్ని ఫోటోకి దండం పెట్టుకుంటానని శైలేంద్ర చెప్తాడు. జగతి ఫోటో చూసి చలించిపోతుంది అనుపమ. రిషి వసుధారలు పూర్తిగా లోపలికి వెళ్లడంతో అనుపమని ఇంటికి తీసుకెళ్తాడు శైలేంద్ర.

Guppedantha Manasu November 18th Episode today
Guppedantha Manasu November 18th Episode

అనుపమ రాగానే ఎలా ఉన్నావని డ్రామా చేస్తుంది దేవయాని. జగతి బాబాయ్ ల పెళ్లి చేసింది అనుపమ ఏ అని శైలేంద్రకి చెప్తుంది. మీకు ఆ పెళ్లి అంటే ఇష్టం లేదు కదా అని అనుపమ అడుగుతుంది. మనుషులు మారతారు కదా. తర్వాత తను బాగా నచ్చింది అని దేవయాని చెప్తుంది. అలాంటప్పుడు ఇంటి నుండి వెళ్లేటప్పుడు, ఎందుకు ఆపలేదని అనుపమడుగుతుంది. నేను చేయాల్సింది నేను చేశాను. వాళ్ళ తల్లిదండ్రుల కోసం వెళ్ళింది అని చెప్తుంది. ఇంటి నుండి వెళ్ళాక ఒకసారి కూడా మహేంద్ర తనని తీసుకురావడానికి ప్రయత్నించలేదని దేవయాని అంటుంది.

అదేంటి మామ్ బాబాయ్ బానే ఉండేవాడు కదా అని శైలేంద్ర అంటాడు. మీరైనా మహేంద్ర కి చెప్తే బాగుండేది కదా అని అనుపమంటుంది. భార్యాభర్తల మధ్య జోక్యం చేసుకోవద్దని మాట్లాడలేదు అని దేవయాని అంటుంది. ధరణి వస్తే ఎంతో గొప్పగా చెప్తుంది. అంటే మీకు ఎదురు చెప్పదు. కాబట్టి మంచి అమ్మాయా అని అనుపమ అంటుంది. లేదు నిజంగా మంచి అమ్మాయి అని దేవయాని, శైలేంద్ర అంటారు. జగతి ఎలా చనిపోయిందని అడుగుతుంది అనుపమ. రిషి ని కాల్చబోతుంటే జగతి అడ్డు వెళ్ళింది అని దేవయ్య అని అంటుంది.

చంపాల్సిన అవసరం ఏంటని అనుపమ అడుగుతుంది ఏమో అలా జరిగిందని వాళ్ళు చెప్పారు అసలు జరిగింది ఏంటో తెలియదు అని చెప్తుంది. రిషి వసు మాత్రమే అక్కడ ఉన్నారని అంటుంది. పిన్ని ఎండి అయినప్పటినుండి గొడవలు. వసుధారా, పిన్నికి ఆర్గుమెంట్స్ జరిగేవి వాటిని తీర్చలేక రిషి నలిగిపోయేవాడు అని శైలేంద్ర చెప్తాడు మరి ఎండి సీటు కావాలని మీకు ఎప్పుడు అనిపించలేదా అని అనుపమ అడుగుతుంది.

నాకెందుకు అంత పదవులు. నేను మోయలేను అనే శైలేంద్ర అంటే అలా ఎందుకనుకోవాలి..? ఎవరికైనా ఆశ ఉంటుంది కదా అని అనుపమ అంటుంది. అలా కాదు డాడ్ లాగ అడ్మినిస్ట్రేషన్ పనులు చూసుకుంటానని శైలేంద్ర చెప్తాడు. ఆ ఎండి సీటు ఎందుకు లేమ్మా జగతి కూర్చున్న అప్పటి నుండే ఇదంతా. మా కాలేజీ మీద ఎవరో కన్ను వేశారు అని చెప్తుంది దేవయాని. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now