Chiranjeevi : దీవాళి ఈవెంట్స్‌లో డ్యాన్స్‌తో అద‌రగొట్టిన చిరు.. కానీ సింగ‌ర్ ప్రైవేట్ పార్ట్ ట‌చ్ చేయ‌డ‌మే బాగాలేదు..!

November 17, 2023 10:21 AM

Chiranjeevi : వ‌య‌స్సు పెరుగుతున్నా కూడా చిరుకి జోష్ త‌గ్గ‌డం లేదు. కుర్ర‌హీరోల‌తో పోటీ ప‌డుతూ డ్యాన్స్‌లు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం చిరంజీవి వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూనే ఉన్నాడు. చిరంజీవి ఇప్పుడు తీస్తున్న చిత్రాల మీద అందరికీ కంప్లైంట్స్ ఉన్నాయి. లూసిఫర్ రీమేక్‌గా గాడ్ ఫాదర్ తీసినా నిరాశ‌ప‌ర‌చింది. రొటీన్ రొడ్డ కొట్టుడు భోళా శంకర్ తీసినా చూడలేదు. ఈ వయసులోనూ ఇలాంటి చిత్రాలేంటి? అని విమర్శించసాగారు. అయితే వాల్తేరు వీరయ్యను మాత్రం ఆకాశానికి ఎత్తారు. ఈ సినిమా విజ‌యం త‌ర్వాత చిరంజీవి ఎలాంటి సినిమాలు తీస్తే బాగుంటుందో ఆయ‌న‌కి అర్ధమైంది.

ఇక చిరంజీవి ఇంట్లో ఇటీవ‌ల దీపావ‌ళి సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా జ‌రిగాయి. మనవరాలు క్లింకార కొణిదెల పుట్టాక వచ్చాక మొదటి దీపావళి కావడంతో గ్రాండ్‌గా దీపావళి సెలబ్రేట్‌ చేశారు. మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు నాగార్జున, వెంకటేశ్‌, మహేశ్‌ బాబు, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠీ, మంచు లక్ష్మీ తదితరులు సతీసమేతంగా ఈ వేడుకల్లో సందడి చేశారు. ఇక ఇదే వేడుకల్లో మెగాస్టార్‌ చిరంజీవి సూపర్బ్‌ స్టెప్పులేసి ఆహుతులను అలరించారు. బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ నటించిన జవాన్ టైటిల్‌ సాంగ్‌కు తన దైన స్టైల్‌లో డ్యాన్స్‌ వేశారు మెగాస్టార్‌. ప్రముఖ సింగర్‌ రాజకుమారి ‘జవాన్’ పాటను ఆలపిస్తుండగా చిరంజీవి తనదైన గ్రేస్‌తో డ్యాన్స్‌ చేశారు.

Chiranjeevi dance with singer rajkumari video viral
Chiranjeevi

ఇక హీరో రామ్‌ చరణ్‌ దగ్గరుండి మరీ తన తండ్రిని ఎంకరేజ్‌ చేస్తూ కనిపించడం విశేషం. చిరంజీవి డ్యాన్స్ పై ప‌లువురు సెల‌బ్రిటీలు, అభిమానులు, నెటిజ‌న్స్ క్రేజీ కామెంట్స్ చేశారు. అయితే ఈ వీడియోలో చిరు సింగ‌ర్‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడంటూ మెగా హేట‌ర్స్ కామెంట్ చేస్తున్నారు. సింగ‌ర్ రాజకుమారిని ప్రశంసిస్తూ ఆమె ప్రైవేట్ పార్ట్స్ ని తాకినట్లు వీడియోలో క‌నిపిస్తుంద‌ని, ఈ వ‌య‌స్సులో ఇలా చేయ‌డం నీకు త‌గునా అంటూ మెగాస్టార్‌ని ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనిపై మెగా ఫ్యాన్స్ మాత్రం ఆగ్ర‌హం క‌నిపిస్తున్నారు. స‌రిగ్గా చూడ‌కుండా ఇలా కామెంట్స్ చేయ‌డం ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now