Navdeep Dugout OTT : ఆహా ఓటీటీలో న‌వ‌దీప్ హోస్ట్‌గా డ‌గౌట్.. క్రికెట్ థీమ్‌తో రూపొందుతున్న రియాలిటీ షో..

November 16, 2023 9:09 PM

Navdeep Dugout OTT : ప్ర‌స్తుతం అంత‌టా ఓటీటీ హంగామా న‌డుస్తుంది. వైవిధ్య‌మైన కంటెంట్ ఓటీటీలోకి వ‌స్తున్న నేప‌థ్యంలో యూజర్స్ కూడా ఓటీటీకి ఎక్కువ‌గా క‌నెక్ట్ అవుతున్నారు. ఇక తెలుగులో ఆహా వైవిధ్య‌మైన కార్య‌క్ర‌మాల‌తో తెగ సంద‌డి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సినిమాలతో పాటు ప్ర‌త్యేక షోస్ చేస్తూ అల‌రిస్తుంది. బాల‌కృష్ణ హోస్ట్ గా చేసిన అన్‌స్టాప‌బుల్‌కి ఎంత ఆద‌ర‌ణ ల‌భించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు సక్సెస్ ఫుల్‌గా సీజ‌న్ 3 జ‌రుపుకుంటుంది. ఇక ఇప్పుడు ఆహాలో డగౌట్ అనే రియాలీ షో కూడా ప్ర‌సారం కానుంద‌ని టీజ‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఈ షోకి న‌వ‌దీప్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో నవదీప్ కూడా ఒకరు. ఒకప్పుడు జై, గౌతమ్ SSC, చందమామ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా అచ్చేసిన నవదీప్ ఆ తర్వాత సెకండ్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోయాడు. నవదీప్ చివరిసారిగా 2021లో మోసగాళ్లు సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత ఎక్కువగా వెబ్ సిరీస్ ల మీద ఫోకస్ పెట్టి వరుసగా పలు ఓటీటీలలో సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్నాడు. న్యూసెన్స్ అనే సిరీస్ తో ఆహా ఓటీటీలో ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు. ఇందులో నవదీప్, బిందుమాధవి జంటగా నటించారు. ఇప్పుడు సరికొత్త రియాలిటీ షోతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Navdeep Dugout OTT when to stream know the details
Navdeep Dugout OTT

క్రికెట్ థీమ్‌తో త్వరలో ఓటీటీలోకి రానున్న రియాలిటీ గేమ్ షో పేరు డగౌట్ కాగా, . రోల్ టు రూల్ అనేది క్యాప్షన్. తాజాగా దీనికి సంబంధించిన టీజ‌ర్ విడుద‌లైంది. “చేతిలో ఆట, ఆటలో వేట.. ఇక క్రికెట్ పండుగే ప్రతీ చోట” అని రాసుకొస్తూ ప్రముఖ ఓటీటీ ఆహాలో డగౌట్ రియాలిటీ షోను నవంబర్ 18న రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. టీజర్‌లో “క్రికెట్ అంటే గేమ్ కాదు.. ఒక ఎమోషన్”, “రోల్ చేసేది సెలబ్రిటీలు.. రూల్ చేసేది మనం” అంటూ నవదీప్ చెప్పుకురాగా, ఆయ‌న చెప్పిన దానిని బ‌ట్టి చూస్తుంటే ఆయ‌న సెల‌బ్రిటీల‌తో క‌లిసి క్రికెట్ గురించి చ‌ర్చ‌లు జ‌రుపుతాడా అని అంద‌రి మ‌దిలో క‌దులుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now