Alia Bhatt : నా భ‌ర్త ఏంటో నాకు తెలుసు.. ర‌ణ్‌బీర్‌పై జ‌రుగుతున్న ట్రోలింగ్‌పై స్పందించిన అలియా

November 16, 2023 7:42 PM

Alia Bhatt : కొన్నాళ్లుగా ప్రేమ‌లో మునిగి తేలిన ర‌ణ్‌బీర్ క‌పూర్, అలియా భ‌ట్ జంట పెళ్లి బంధంతో ఒక్క‌టైన విష‌యం తెలిసిందే.వీరు ఇద్ద‌రు కూడా బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో ఒకరు.గత ఏడాది ముంబైలో వారి సన్నిహిత కుటుంబ సభ్యులు హాజరైన ప్రైవేట్ వేడుకలో వారు పెళ్లి చేసుకున్నారు. అయితే ర‌ణ్‌బీర్‌కి చాక్లెట్ బాయ్ గా పేరుంది. ఇంత గ్లామ‌ర్‌గా ఉండే అత‌ను అలియాని పెళ్లి చేసుకోక‌ముందు చాలా మంది హీరోయిన్స్‌తో ఎఫైర్‌లో ఉన్నాడ‌నే ప్ర‌చారం జ‌రిగింది. బ‌చ్నా ఏ హసీనో (2008)లో కలిసి నటించినప్పుడు రణ్‌బీర్, దీపిక ప్రేమలో పడ్డారు. 2010లో రణ్‌బీర్ వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడని పుకార్లు రావడంతో దీపికా అత‌నికి బ్రేక‌ప్ ఇచ్చేసింది.

అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ (2009)లో కలిసి నటించిన తర్వాత రణ్‌బీర్, కత్రినా కొన్నాళ్లు డేటింగ్‌లో ఉండ‌గా, వారిరివ‌రు వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసారు.కానీ అయితే, 2016లో వారు విడిపోయారు. అనంత‌రం రణ్‌బీర్ తన రాక్‌స్టార్ (2011) సహనటి నర్గీస్ ఫక్రీతో రిలేషన్ పెట్టుకున్నాడు. మహ‌రీ ఖాన్, అమీషా ప‌టేల్, ఏంజెలా జాన్స‌న్, శృతి హాసన్, అవంతిక మాలిక్, సోన‌మ్ క‌పూర్, నందిత మ‌హ‌తాని వంటి వారితో ఎఫైర్లు పెట్టుకున్నాడ‌ని అనేక ప్ర‌చారాలు వ‌చ్చాయి. ఇటీవ‌ల ర‌ణ్‌బీర్‌పై దీనిపై బాగా ట్రోలింగ్ న‌డిచింది. ఇక రణబీర్ కపూర్ కు అలియా లిప్ స్టిక్ వేసుకోవడం ఇష్టముండదట. దీనికి ‘టాక్సిక్’ అని ట్యాగ్ చేస్తూ ట్రోల్ చేశారు కొందరు. దీనిపై ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Alia Bhatt responded on her husband news
Alia Bhatt

కరణ్ జోహార్.. ‘కాఫీ విత్ కరణ్’ షోకి వచ్చిన అతిధులను పలు వ్యక్తిగత ప్రశ్నలు అడిగి ఇబ్బుందులు పెడుతుండ‌డం మనం చూస్తూనే ఉన్నాం. రణ్‌బీర్ కపూర్‌ను ‘టాక్సిక్’ అని చాలా మంది ట్రోల్ చేస్తున్న‌ప్ప‌టికీ ఇన్నాళ్లు ర‌ణ్‌బీర్‌తో పాటు అలియా మౌనంగా ఉంది. తాజాగా మాత్రం స్పందించింది.. ర‌ణ్‌బీర్ క‌పూర్‌పై ‘ఇలా జరగడం నాకు బాధగా ఉంది. ఎందుకంటే రణబీర్ కపూర్ వ్యక్తిత్వం నాకు తెలుసు. నా మాటలు తప్పుగా అర్ధం చేసుకున్నారు. నా సహచరులు కూడా నాతో చెప్పారు. కానీ రణ్ బీర్ కపూర్ పై త‌ప్పుడు కథనాలు రాసారు. ప్రపంచంలో దృష్టి పెట్టాల్సిన ఇతర అంశాలు కూడా ఉన్నాయి’ అని అలియా భట్ కాస్త బాధ‌ప‌డుతూ చెప్పుకొచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now