Sai Dharam Tej : సాయిధ‌రమ్ తేజ్‌కి నోట మాట‌ రాకుండా చేసిన నెటిజన్ ప్ర‌శ్న‌..!

November 15, 2023 5:08 PM

Sai Dharam Tej : మెగా ప‌వర్ స్టార్ సాయిధ‌ర‌మ్ తేజ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇటీవ‌ల పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డ సాయి ధ‌రమ్ తేజ్ రీఎంట్రీ త‌ర్వాత విరూపాక్ష అనే సినిమా చేశాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమా త‌ర్వాత మేన‌మామ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి బ్రో చిత్రం చేశాడు. ఈ చిత్రంకి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.అయితే తేజ్ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తొమ్మిదేళ్లు పూర్తవుతోంది. పలు సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న తేజ్… ప్రస్తుతం ‘గాంజా శంకర్’ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఇదే కాక ప‌లు సినిమాల‌ని లైన్‌లో పెట్టాడు. అయితే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తేజ్.. తాజాగా త‌న అభిమానులతో తాజాగా చిట్ చాట్ చేశాడు.

చిట్ చాట్‌లో భాగంగా ఓ నెటిజెన్.. మీ సినిమాలలో మీకు చాలా సంతృప్తిని ఇచ్చిన పాత్రలు ఏమిటని అడ‌గ‌గా, దీనికి సమాధానంగా చిత్రలహరి, రిపబ్లిక్ సినిమాల్లోని పాత్రలు తనకుఎంతో సంతృప్తిని ఇచ్చాయ‌ని తెలియ‌జేశాడు. అయితే రిప‌బ్లిక్ పేరు తేజు త‌ప్పుగా టైప్ చేయ‌డంతో ఓ నెటిజ‌న్ సెటైర్ వేశాడు. అది రిలబ్లిక్ కాదురా రిపబ్లిక్… ఎప్పుడైనా స్కూల్ కి వెళ్లావా? అని ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలపై తేజ్ స్పందిస్తూ… తమ స్కూల్లో తమకు గౌరవం కూడా నేర్పించారని, మీ స్కూల్లో నీకు నేర్పించారా? అని ప్రశ్నించాడు. నేర్పించకపోతే నేర్చుకో అంటూ గ‌ట్టిగానే ఇచ్చిప‌డేసాడు. అయితే అప్పుడు నెటిజన్.. నన్ను క్షమించు అన్నా… నీవు రిప్లై ఇవ్వవనే అలా పెట్టాను అని కామెంట్ చేశాడు.

Sai Dharam Tej surprised by netizen question
Sai Dharam Tej

మీ పెళ్లి ఎప్పుడు బ్రో? అని ఓ నెటిజన్ అడగ్గా, నీ వివాహం అయిన వెంటనే అని స్టన్నింగ్ స‌మాధానం ఇచ్చారు. చిన్న మామ పవన్ కల్యాణ్ తో కలిసి సినిమా చేశారు? పెద్దమామ(చిరంజీవి)తో సినిమా ఎప్పుడు చేస్తారు? అని అడ‌గ‌గా, ఆ అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్న‌ట్టు తెలియ‌జేశాడు.మ‌రో నెటిజన్ అర్జెంట్ గా రూ. 10 లక్షలు కావాలని అడిగాడు. అయితే, ఈ ప్రశ్నకు బ్రహ్మానందం నవ్వుతూ ఉండే జిఫ్ ఇమేజ్ ని స‌మాధానంగా ఇచ్చాడు. మరో నెటిజ‌న్ రెగ్యుల‌ర్ సినిమాలు కాకుండా విరూపాక్ష లాంటి సినిమాలు ట్రై చేయ‌మ‌ని అన్నాడు. తాను అన్ని రకాల సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now