Guppedantha Manasu November 15th Episode : జగతిని చంపిన వాళ్లను వదలన‌న్న‌ అనుపమ, శైలేంద్ర సంగ‌తేంటి..?

November 15, 2023 11:45 AM

Guppedantha Manasu November 15th Episode : జగతి మరణ వార్త విని అనుపమతోపాటు ఏంజెల్, విశ్వనాథం కూడా షాక‌వుతారు. తర్వాత అనుపమ ఆవేశంగా లేచి, ఈ విషయం తనకు ఎందుకు చెప్పలేదని నిలదీస్తుంది. ఎందుకు దాచావ్ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. మనం ప్రాణ స్నేహితులం కదా, జగతికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనని తెలసుకదా ? మరి ఎందుకు చెప్పలేదు? నువ్వే చంపావ్ కదా? అంటూ మహేంద్ర కాలర్ పట్టుకొని పైకి లేపి, నువ్వు తనను దగ్గరకు తీయలేదనే బాధతోనే చనిపోయిందా అంటూ ఆవేశంగా ప్రశ్నలు వేస్తుంది. అంతలా ప్రేమించి ఎందుకు దూరం చేసుకున్నావ్? అసలు జగతిని ఎలా చంపావ్ అంటూ అడుగుతుంది. ఆ ప్రశ్నలకు రిషి, వసులు కూడా షాక‌వుతారు.

దీంతో, రిషి స్పందిస్తాడు. మా అమ్మ చ‌నిపోవడానికి కారణం డాడ్ కారణం కాదని, అసలు జగతి ఎలా చనిపోయిందో చెప్పేస్తాడు. ఆ తర్వాత డాడ్ రండి వెళ్లిపోదాం అని మహేంద్రను తీసుకొని వెళ్లిపోతాడు. మరోవైపు, అనుపమ వెక్కి వెక్కి ఏడుస్తుంది. అక్కడ జరుగుతున్నది అర్థం కాక, ఏంజెల్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రిషి కారులో మహేంద్ర, వసుధారలను తీసుకొని వెళుతూ ఉంటాడు. మధ్యలో మహేంద్ర కారు ఆపమని అడుగుతాడు. ఎందుకు డాడ్ అని రిషి అడిగితే, కాసేపు పక్కకు ఆపమని రిక్వెస్ట్ చేస్తాడు. దీంతో, రిషి కారు ఆపుతాడు. కారు దిగిన మహేంద్ర, గట్టిగా అరుస్తాడు. రిషి, వసులు అతనని సముదాయించడానికి ప్రయత్నిస్తారు. దీంతో, మహేంద్ర తన మనసులోని ఆవేదనంతా బయటపెడతాడు.

దీంతో, అనుపమ మీ ఫ్రెండ్ ఆ అని వసు, రిషిలు అడుగుతారు. అనుపమకు జగతి అంటే చాలా ఇష్టమని, తన కోసం చాలా చేసేది అని అన్ని విషయాలు పంచుకుంటాడు. మా ప్రేమకు సపోర్ట్ చేసింది కూడా తనేనని గుర్తు చేసుకుంటాడు. తమ పెళ్లికి ఇంట్లోవాళ్లు అంగీకరించకపోతే, తానే స్వయంగా అందరినీ ఎదిరించి మరీ పెళ్లి చేసిందని గుర్తుచేసుకుంటాడు. ఇప్పుడు జగతి లేదని తెలిసి, అనుపమ తనతో సరిగా ఉండదని, తమ స్నేహం పాడైపోతుందని మహేంద్ర ఫీలౌతుంటే, అలా ఏమీ జరగదని రిషి, వసులు ధైర్యంచెప్పి, అక్కడి నుంచి తీసుకొని వెళతారు.

ఇంటికి వెళ్లిపోయిన అనుపమ, జగతి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఆమె వద్దకు విశ్వనాథం, ఏంజెల్ వచ్చి ఏమైందని ప్రశ్నిస్తారు. అయితే, తన మనసు ఏమీ బాలేదని, ఒంటరిగా వదిలేయమని అడుగుతుంది. జగతి గురించి బాధపడుతున్నావా? రిషి వాళ్లు నీకు నిజం చెబుతున్నప్పుడు మేము కూడా విన్నాం. చాలా షాక్ అయ్యాం. జగతి చాలా మంచి మనిషి, ఆమె చనిపోయింది అంటే మేము కూడా నమ్మలేకపోతున్నాం. అని విశ్వనాథం చెబుతాడు. అయితే, నాకు జగతి అంటే ప్రాణం. ఈ ఫంక్షన్ చేసింది నేను జగతి కోసం. ఆ వార్త వినగానే నా గుండె పగిలిపోయింది అని అనుపమ చెబుతుంది. మహేంద్ర ఈ విషయం తన దగ్గర ఎందుకు దాచి పెట్టాడు అని ఆలోచిస్తూ ఉంటుంది.

Guppedantha Manasu November 15th Episode today
Guppedantha Manasu November 15th Episode

జగతి, రిషిని కాపాడే క్రమంలో చనిపోయిందని చెబుతున్నారు. అసలు జగతిని ఎవరు చంపారు? అంత అవసరం ఎవరికి ఉంది? ఇది జరిగి చాలా రోజులు అవుతోంది అంటున్నారు. ఆ హంతకుడిని ఎందుకు పట్టుకోలేదు? అంటూ చాలా ప్రశ్నలు వేస్తుంది. అయితే, రిషి ఈ విషయాన్ని అంత తేలికగా వదిలేయడని, కచ్చితంగా నేరస్థులను పట్టుకుంటాడని ఏంజెల్ చెబుతుంది. రిషి గురించి నీకు అంత బాగా తెలుసా అని అనుపమ సందేహం వ్యక్తం చేస్తుంది. తనకు రిషి మంచి ఫ్రెండ్ అని, వాళ్ల కుటుంబం మొత్తం తనకు తెలుసు అని, జగతి వాళ్లు తమ ఇంటికి కూడా వచ్చారని, జగతితో ఉన్న ఆ రెండు , మూడు రోజులు తనకు మంచి అనుభూతిని ఇచ్చిందని ఏంజెల్, అనుపమతో చెబుతుంది. విశ్వనాథం కూడా అవును అని చెబుతాడు.

జగతి చాలా తెలివైనదని, జగతి తనతో మాట్లాడుతుంటే, నువ్వే గుర్తుకు వచ్చావ్ అని అనుపమతో చెబుతాడు. జగతి పక్కన లేకపోవడంతో, మహేంద్ర చాలా బాధపడుతున్నాడని, ప్రాణం లేని మనిషిలా కనపడుతున్నాడని, అతనిని చూస్తేనే అర్థమ‌వుతుందని విశ్వనాథం చెబుతాడు. ఇక, విశ్వనాథం కి కొన్ని అనుమానాలు వస్తాయి. అనుపమ ఒంటరిగా మిగిలిపోవడానికి మహేంద్రే కారణం అని అనుకుంటాడు. అదే విషయాన్ని అనుపమను అడగబోతాడు. కానీ, గతం తాలుకు విషయాలను వదిలేయమని అనుపమ బ్రతిమిలాడటంతో, మళ్లీ ఆ ప్రస్తావన తీసుకురాడు. కానీ, ఏం జరిగిందని ఏంజెల్ ఆరా తీస్తుంది. దీంతో, విశ్వనాథం నిజం చెబుతాడు.

ఇక, ఏంజెల్ కి పూర్తిగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఏంజెల్, రిషిని ప్రేమించినట్లు, అప్పుడు అనుపమ, మహేంద్రను ప్రేమిస్తుంది. ఇద్దరూ వారి ప్రేమను త్యాగం చేస్తారు. అదే విషయాన్ని విశ్వనాథం ఇన్ డైరెక్ట్ గా చెబుతాడు. ఇక, ఏంజెల్ రిషి గురించి ఆలోచిస్తుంటే, అనుమప మహేంద్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక, వసు ఇంట్లో నిద్రపోతూ ఉంటుంది. సడెన్ గా మెళకువ వచ్చి చూసే సరికి, పక్కన రిషి ఉండడు. దీంతో, రిషి కోసం వెతుకుతూ ఉంటుంది. చూస్తే, రిషి కిచెన్ లో వంట చేస్తూ కనపడతాడు. దీంతో, మీరు ఎందుకు వంట చేస్తున్నారు అని వసు అడుగుతుంది.

మీకు ఏమైనా కావాలంటే నన్ను అడగొచ్చు కదా అని వసు అంటే, అన్నింటికీ నీ మీద ఆధారపడటం ఎందుకులే వసుధారా, మా మగవాళ్లకు కూడా కొంచెం స్వాతంత్ర్యం ఇవ్వండి అంటూ సమాధానం కొంటెగా ఇస్తాడు. ఎవరి పనులు వాళ్లు చేస్తేనే బాగుంటుందని వసు అంటే, అప్పుడప్పుడు ఇలా పనులు చేస్తేనే కదా, నీ కష్టం కూడా నాకు అర్థమయ్యేది అని రిషి అంటాడు. ఇక, రిషి వంట గదిలో ఎక్కడ ఏం ఉన్నాయో తనకు తెలుసు అని అన్నీ చూపిస్తూ ఉంటాడు. ఆ క్రమంలో బియ్యం చాట లాగుతాడు. అది కాస్త అక్షింతల్లా, వాళ్ల ఇద్దరి తలమీద పడిపతాయి. అది చూసి ఇద్దరూ షాకైపోతారు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now