Rajinikanth : సెమీ ఫైన‌ల్ మ్యాచ్ కోసం ముంబై వెళ్లిన ర‌జ‌నీకాంత్‌..!

November 15, 2023 1:23 PM

Rajinikanth : మ‌రి కొద్ది నిమిషాల‌లో ఇండియా, న్యూజిలాండ్ మ‌ధ్య తొలి సెమీస్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌న్డే సిరీస్లో భాగంగా జ‌ర‌గ‌నున్న తొలి సెమీస్ కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌చ్చారు. బుధవారం మధ్యాహ్నం 2గంటలకు ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఏ జ‌ట్టు విజ‌యం సాధిస్తుందో ఆ జ‌ట‌టు వరల్డ్ కప్ ఫైనల్ లోకి అడుగుపెడుతుంది. లీగ్ దశలో ఓటమి లేకుండా ఆడిన తొమ్మిది మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా సెమీస్ లోనూ కివీస్ ను మట్టి కరిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు క్రికెట్ ప్రియులతో పాటు సినీ ప్ర‌ముఖులు సైతం ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు.

అయితే నిర్వాహ‌కులు ప్రతిష్టాత్మక సెమీ ఫైనల్ వీక్షించేందుకు కొందరు సెలెబ్స్ కి గోల్డెన్ పాస్ లు జారీ చేశారు. ఈ గోల్డెన్ టికెట్ అందుకున్న అతికొద్ది మంది లో రజినీకాంత్ ఒకరు కాగా, రజనీకాంత్ మ్యాచ్ ను వీక్షించేందుకు ముంబై బయలుదేరి వెళ్లారు. చెన్నై విమానాశ్రయంలో విమానం ఎక్కేందుకు వచ్చిన రజనీకాంత్.. ఎయిర్ పోర్టు వెలుపల గుమికూడిన మీడియాతో మాట్లాడుతై… ‘నేను ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ చూడబోతున్నాను’ అని పేర్కొన్నారు. కొన్ని గంటల తరువాత రంజనీకాంత్ ముంబై విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లడం మీడియా కెమెరాల‌లో రికార్డ్ అయింది. రజనీకాంత్ తో పాటు అతని సతీమణి లతా రజనీకాంత్ కూడా మ్యాచ్ చూసేందుకు వెళ్ల‌గా, వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Rajinikanth went to mumbai to watch semi final match
Rajinikanth

వన్డే వరల్డ్ కప్ చరిత్రలో న్యూజిలాండ్ వర్సెస్ భారత్ జట్లు తొమ్మిది సార్లు త‌ల‌ప‌డ‌గా, ఇందులో ఐదుసార్లు కివీస్, భారత్ జట్టు నాలుగు సార్లు గెలిచింది. ఈ ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో కివీస్ పై భారత్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించ‌గా, సెమీస్‌లో స‌త్తా చాటుతారా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక ర‌జనీకాంత్ విష‌యానికి వ‌స్తే జైలర్ మూవీతో మంచి హిట్ కొట్టిన ర‌జ‌నీకాంత్ ప్రస్తుతం లాల్ సలామ్ అనే మూవీ చేస్తున్నారు. విష్ణు విశాల్ ప్రధాన పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో రజినీకాంత్ ది ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఇక దర్శకుడు టీజీ జ్ఞానవేల్ తో 170వ చిత్రం చేస్తున్నారు. అలాగే 171వ చిత్రం లోకేష్ కనకరాజ్ తో ప్రకటించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now