Sai Pallavi : గుడ్ న్యూస్ చెప్పిన సాయి ప‌ల్ల‌వి.. ఫైన‌ల్లీ మెగా హీరోతో..!

November 12, 2023 2:36 PM

Sai Pallavi : లేడి ప‌వ‌ర్ స్టార్ సాయి ప‌ల్ల‌వి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్కర్లేదు. హీరోల‌ని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సాయి ప‌ల్ల‌వి ఇటీవ‌లి కాలంలో సినిమాలు త‌గ్గించేసింది. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన సాయి ప‌ల్ల‌వి ఇటీవ‌లి కాలంలో చేసిన సినిమాలన్నీ దాదాపు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ భామ. గతకొంతకాలంగా సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉంటుంది. తెలుగులో ఈ సాయి పల్లవి చేసిన సినిమాలన్నీ దాదాపు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ భామ.

తెలుగులో ఈ చిన్నది చివరిగా రానా హీరోగా నటించిన విరాటపర్వం సినిమాలో కనిపించింది. తమిళ్ లో గార్గి సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యింది. ఆతర్వాత సాయి పల్లవి సైలెంట్ అయ్యింది. ఆమె నుంచి కొత్త సినిమా ఏది రాక‌పోవ‌డంతో ఈ అమ్మ‌డు పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంద‌ని అంద‌రు అనుకున్నారు. మ‌రి కొంద‌రు ఈ అమ్మ‌డు సినిమాలు మానేసిందని, డాక్టర్స్ గా సెటిల్ కాబోతుందని వార్తలు వచ్చాయి. కొంతమంది ఏకంగా పెళ్లి చేసుకోనుందని కూడా ప్రచారం చేశారు. అయితే శివ కార్తికేయన్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది సాయి ప‌ల్ల‌వి.

Sai Pallavi finally got a chance in a new film
Sai Pallavi

తెలుగులో ఎవ‌రితో సాయిప‌ల్లవి సినిమా చేస్తుంద‌ని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో ఓ ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గేమ్ చేంజ‌ర్ సినిమా త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌-బుచ్చిబాబు కాంబోలో ఓ సినిమా రూపొందుతుంది.ఈ సినిమాల్లో సాయి పల్లవి సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ముందుగా ఈ పాత్ర కోసం జాన్వి కపూర్, మృణాల్ ఠాకూర్ లాంటి గ్లామరస్ బ్యూటీలను అనుకున్నారని ..కధ పరంగా చాలా డెప్త్ ఉండడంతో సాయి పల్లవి లాంటి క‌థానాయిక‌ని తీసుకుంటే సినిమాకి డెప్త్ వ‌స్తుంద‌ని ఆమెని ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. దీనిపై క్లారిటీ త్వ‌రలోనే రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now