Mahesh Babu : మ‌హేష్ బాబు స్ట‌డీస్‌లో అంత వీకా.. ప‌దో త‌ర‌గ‌తిలో మార్కులు రాక ఇంట‌ర్ సీట్ కూడా రాలేదా..!

November 12, 2023 12:36 PM

Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మ‌హేష్ బాబు ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు.ఆయ‌న ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల‌లో ఒక‌రు. ఆయ‌న ఎన్నో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంటున్నాడు.స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేస్తున్నారు. గుంటూరు కారం అంటూ వస్తోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానుందని ప్రకటించారు.

మ‌హేష్ బాబు సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి త‌ప్ప‌క స‌మ‌యం కేటాయిస్తాడు. ఆయ‌న‌తో రెగ్యుల‌ర్‌గా వాళ్ల‌తో విదేశాల‌కి వెళుతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటాడు. తన భార్య నమ్ర‌త‌తో పాటు తన ఇద్దరు పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. మహేష్ ది ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మ‌న‌స్త‌త్వం. ఆయ‌న త‌న ఫ్యామిలీ కోస‌మే కాక స‌మాజం కోసం చాలా చేశాడు. త‌ను కొన్ని గ్రామాల‌ని ద‌త్త‌త తీసుకున్నాడు. అలానే చాలా మందికి అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు త‌న‌వంతు సాయం చేస్తూ వ‌స్తున్నాడు. అయితే తాజాగా మ‌హేష్ బాబు గురించి ఒక వార్త ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Mahesh Babu educational qualifications and studies
Mahesh Babu

మ‌హేష్ స్కూలింగ్ చేస్తున్న‌ప్పుడు ఆయ‌న‌కి మార్కులు చాలా త‌క్కువ వ‌చ్చేవ‌ట‌. ఆయ‌న కృష్ణ త‌న‌యుడు కావ‌డంతో ఉపాధ్యాయులు కూడా మహేష్‌ను గారాబం చేసేవారు. మార్కులు తక్కువ వచ్చినా ఏమీ అనేవారు కాదట‌. మ‌హేష్‌కి గారాబం ఎక్కువ కావ‌డంతో చ‌దువు స‌రిగ్గా అబ్బ‌లేదు. అయితే పదో తరగతిలో కూడా అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదు. సినిమాల వల్ల కొడుకు చదువు ఎక్కడ పాడైపోతుందో అన్న భయంతో మ‌హేష్‌ని మంద‌లించాడ‌ట‌. అయిన కూడా పదో తరగతిలో అనుకున్న మార్కులు రాలేదు. ఇష్టమైన లయోలా కాలేజీలో ఇంటర్ చదివేందుకు మహేష్‌కు అడ్మిషన్ కూడా రాలేద‌ట. డిగ్రీలో అయిన సీటు సంపాదించుకోవాల‌ని ఇంట‌ర్‌లో క‌ష్ట‌ప‌డి చ‌ద‌వ‌గా, మంచి మార్కులు రావ‌డంతో తాను అనుకున్నట్టుగానే లయోలా డిగ్రీ కాలేజీలో బీకాం సీటు సాధించాడు. ఆ స‌మ‌యంలో మ‌హేష్‌కి సినిమాల‌పై ఆస‌క్తి పెర‌గ‌డంతో తిరిగి సినిమాల‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now