Radha Daughter Karthika : అల‌నాటి అందాల న‌టి రాధ కూతురు పెళ్లి.. స్పెష‌ల్‌గా ఇన్విటేషన్ అందిస్తున్న రాధ‌

November 12, 2023 9:49 AM

Radha Daughter Karthika : అల‌నాటి అందాల తార రాధ గురించి ప్ర‌త్యేక పరిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆమె చిరంజీవికి జంట‌గా ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించి అల‌రించింది. ఇక రాధ పెద్ద కుమార్తె కార్తీక కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. అక్కినేని నాగచైతన్య మొదటి సినిమా ‘జోష్’తో కార్తీక హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ వెంటనే ‘రంగం’ సినిమాతో హిట్ అందుకుంది కార్తీక‌. ఇక ‘దమ్ము’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ సినిమాల్లో కార్తీక నటించారు. కానీ, హీరోయిన్‌గా టాలీవుడ్‌లో నిలదొక్కుకోలేకపోయిన ఈ అమ్మ‌డు చివరిగా 2015లో ఓ తమిళ సినిమా ద్వారా వెండితెరపై కనిపించి ఆ త‌ర్వాత సినిమాల‌కి గుడ్ బై చెప్పింది.

రాధ వారసులుగా కార్తీక నాయర్, తులసి నాయర్ హీరోయిన్స్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. రాధ ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపేయ‌గా కూతుళ్లు మాత్రం ఆమె పేరుని నిల‌బెట్ట‌లేక‌పోయారు. కార్తీక సినిమాల‌కి బ్రేక్ ఇచ్చాక దుబాయ్ లో ఉన్న తన ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్ చూసుకుంటున్నారు.క్కడ తమ బిజినెస్ ని మరింత విస్తరించిన కార్తీక.. ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. గత అక్టోబర్‌ నెలలో కార్తీక ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఇక పెళ్లి కూడా మ‌రి కొద్ది రోజుల‌లోనే జ‌ర‌బోతున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు శరావేగంగా జరుగుతున్నాయి. రాధనే స్వ‌యంగా ప‌లువురు సెలెబ్రిటీల ఇంటికి వెళ్లి ఆహ్వానాలు పంచుతున్నారు.

Radha Daughter Karthika getting married
Radha Daughter Karthika

రీసెంట్‌గా ప్రముఖ సీనియర్‌ దర్శకుడు కే రాఘవేంద్ర రావును రాధ కలిశారు. ఆయన్ని పెళ్లికి ఆహ్వానించారు. తనకు ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకి రాధ తొలి ఇన్విటేషన్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుండ‌గా, త్వ‌ర‌లో చిరంజీవి ఇంటికి కూడా వెళ్లి ఆహ్వానం అందిచంనుంద‌ని స‌మాచారం. అయితే రాధ‌కి కాబోయే అల్లుడు ఎవ‌రు, ఏం చేస్తాడు అనే వివ‌రాలు మాత్రం ప్ర‌స్తుతం గోప్యంగా ఉన్నాయి.రాధ 1980 కాలంలో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించగా, తరువాత మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు. ఇప్పుడు టీవీ షోల‌లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now