The Village Series OTT Release Date : ఓటీటీలోకి ఆర్య చిత్రం.. వెన్నులో వ‌ణుకు పుట్టించే వెబ్ సిరీస్

November 10, 2023 4:59 PM

The Village Series OTT Release Date : ఆర్య‌.. ఈ స్టార్ హీరో గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌మిళంతో పాటు తెలుగులోను వైవిధ్యమైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు. రీసెంట్‌గా ఆర్య ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘ది విలేజ్’. ఈ సిరీస్‏తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుండ‌గా, ఇందులో దివ్య పిళ్లై, అజియా, ఆడుకలం నరేన్, జార్జ్ మాయన్, పి.ఎన్. సన్నీ, ముత్తుకుమార్ కె, కలైరాణి ఎస్.ఎస్ కీలకపాత్రలలో నటించారు.. దీనికి మిలింద్ రాజు దర్శకత్వం వహించ‌గా, ఈ చిత్రాన్ని స్టూడియో శక్తి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బి.ఎస్. రాధాకృష్ణన్ నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో హారర్ ఒరిజినల్ సిరీస్‏గా రూపొందించ‌గా, ఈ చిత్రాన్ని తమిళంతోపాటు.. తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుద‌ల చేశారు.

షమిక్ దాస్ గుప్త రచించిన గ్రాఫిక్ నవల ఆధారంగా ది విలేజ్ వెబ్ సిరీస్ రూపొంద‌గా, ఇప్పటికే విడుదలైన ది విలేజ్ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ది విలేజ్ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో నవంబర్ 24 నుంచి తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌లైన పోస్ట‌ర్‌లో చెట్టు రూపంలో ఆర్య మొహం, కొన్ని చేతులు ఆర్యను లోయలోకి లాగడం వంటివి అంద‌రికి వ‌ణుకు పుట్టించేలా ఉన్నాయి. ది విలేజ్ వెబ్ సిరీస్ ప్రేక్షకులకి వ‌ణుకు పుట్టించేలా క‌నిపిస్తుంది. మ‌రి నిజంగా ఎంత‌గా అల‌రిస్తుందో తెలియాలంటే నవంబర్ 24 వరకు ఆగాల్సిందే.

The Village Series OTT Release Date
The Village Series OTT Release Date

ఒక రాత్రి తప్పిపోయిన తన కుటుంబాన్ని తిరిగి పొందేందుకు ఒక వ్యక్తి ఎలాంటి త్యాగానికైన సిద్ధ‌మ‌వుతాడు. ఆ సమయంలో తను ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు? తన కుటుంబం ఏమైంది? చివరకు తన కుటుంబాన్ని తిరిగి పొందాడు అనేది ఈ వెబ్ సిరీస్ ద్వారా ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుల‌కి తెలియ‌జేయ‌నున్నాడు. మ‌రి ఇంత‌గా ఎంతగా అల‌రిస్తుంద‌నేది ఒక ప‌ది రోజులు ఆగితే కాని తెలియ‌దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now