Guppedantha Manasu November 10th Episode : వ‌సుధార చెయ్యి వ‌ద‌ల‌న‌ని మాట ఇచ్చిన రిషి.. కొడుకుకు వసుధార గొప్పతనం చెప్పిన మ‌హేంద్ర..!

November 10, 2023 8:56 AM

Guppedantha Manasu November 10th Episode : జగతి చనిపోయిన విషయాన్ని, ఏంజెల్ దగ్గర ఎందుకు రిషి దాచిపెడతాడు. ఆ విషయం గురించి వసుధార ఆలోచిస్తుంది. అమ్మ తన ప్రాణాలను అడ్డుపెట్టి, నన్ను కాపాడిందని చెప్పిన విషయాన్ని, ఏంజెల్ కట్టు కథ అని అంటే, ఆ మాట తో తన గుండె ముక్కలైపోయిందని రిషి బాధపడతాడు. అమ్మ చనిపోయిన విషయాన్ని, ఎవరికీ చెప్పడం ఇష్టం లేదని, రిషి అంటాడు. నా ప్రాణం ఉన్నంతవరకు అమ్మ నాతోనే నా గుండెల్లోనే ఉంటుందని అంటాడు. రిషి కార్ డ్రైవ్ చేస్తుండగా కారుకి హెల్మెట్ ధరించిన ఒక వ్యక్తి తన బైక్ తో అడ్డుగా వస్తాడు. అతన్ని చూసి ఒక్కసారిగా కారు ఆపుతాడు.

శైలేంద్ర కుట్రలను వివరిస్తూ, జగతి బతికి ఉన్న టైంలో రాసిన లెటర్స్ అన్నీ, విష్ కాలేజ్ లో ఉండిపోతాయి. ఆ లెటర్స్ ని రిషికి అందజేయాలని, పాండ్యన్ కి ప్రిన్సిపల్ చెప్తాడు. ఆ లెటర్స్ ని ఇవ్వడానికి, రిషి కారుకి అడ్డంగా నిలబడతాడు. పాండ్యన్ ఇచ్చిన లెటర్స్ ని చూసి రిషి షాక్ అవుతాడు. ఆ లెటర్స్ ని కార్ లోనే పెట్టేస్తాడు. రిషి ఇంటికి రాగానే మహేంద్ర సోఫాలోనే నిద్రపోయి కనబడతాడు. తండ్రి తాగాడు అనుకుని రిషి కంగారు పడతాడు. తాగనని మాట ఇచ్చాను కదా ఆ మాటకి కట్టుబడి ఉన్నానని కొడుకుతో మహేంద్ర అంటాడు.

జగతిని తాను ఎంతగా ప్రేమించింది రిషితో చెప్తాడు. మహేంద్ర ఎన్నో అడ్డంకుల్ని దాటుకుని, జగతిని తను పెళ్లి చేసుకున్నానని, విధి ఆడిన నాటకంలో తన ఆనందం కనుమనుక అయిపోయిందని మహేంద్ర అంటాడు. ఎలాంటి అపార్ధాలు లేకుండానే జగతి 20 ఏళ్లు దూరమయ్యానని ఆ టైంలో కన్నీళ్ళని దిగమింగుకుంటూ బతికానని మహేంద్ర బాధపడతాడు. నీ జీవితం నా జీవితంలా కాకూడదని కొడుకుకి చెప్తాడు మహేంద్ర.

Guppedantha Manasu November 10th Episode today
Guppedantha Manasu November 10th Episode

రిషిధారల బంధం ఎప్పుడైతే ఏర్పడిందో, అప్పటినుండి వసుధార భర్తగా ఫిక్స్ అయిపోయిందని మహేంద్ర చెప్తాడు. నువ్వే తాళి కట్టినట్లు ఊహించుకుందని తన మెడలో తాళి వేసుకుందని చెప్తాడు. తన తండ్రిని కూడా ఎదిరించిందని రిషి కి చెప్తాడు మహేంద్ర. భరించింది తప్ప కష్టం ఏమిటన్నది చెప్పుకోలేదని అంటాడు. మీ ప్రేమ గొప్పతనం వసుధార మంచితనం వల్ల మళ్ళీ ఆమెకి కనిపించావని మహేంద్ర అంటాడు. నువ్వు ఎంతలా అవమానించిన తిట్టిన ఆమె నీకు మాత్రం దూరంగా వెళ్లలేదని వసుధార మంచితనం గురించి రిషికి మహేంద్ర చెప్తాడు.

ఆమె ప్రాణం నువ్వే అని కూడా చెప్తాడు. జగతి నాకు దొరకడం ఎంత అదృష్టమో వసుధార దొరకడం నీకు అంతకంటే ఎక్కువ అదృష్టం అని చెప్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆమె చెయ్యి వదలతని అంటాడు. ఇక మీదట ఆమె మనసుని నొప్పించే పనిని చెయ్యద్దని అంటాడు. రిషి మహేంద్ర మాటల్ని వసుధార చాటుగా వింటుంది. మహేంద్ర మంచితనం చూసి ఎమోషనల్ అయిపోతుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది.

అక్కడ ఉండలేక కిచెన్ లోకి వస్తుంది. రిషి వెనక నుండి వచ్చి ఆమె కళ్ళు మూస్తాడు. కళ్ళు తడిగా ఉండడంతో షాక్ అవుతాడు. కన్నీళ్ళకి కారణం ఏంటని అడుగుతాడు. కళ్ళల్లో ఏదో పడిందని అబద్ధం ఆడుతుంది. వసుధార కోసం రిషి జుంకాలు గిఫ్ట్ గా ఇస్తాడు. అది చూసి వసు ఆనందంగా ఫీల్ అవుతుంది.

రిషి కూడా సంతోషంగా కనబడతాడు. ఎప్పుడూ ఇలాగే చిరునవ్వుతో ఉండాలని వసుధార అంటుంది. తాను కొన్న జుంకాలని వసుధార చెవులకి పెట్టాలని చూస్తాడు. కానీ జుంకాలు పెట్టడం రాక ఒక జుంకా కింద పడిపోతుంది. ఆ జుంకా రిషికి దొరుకుతుంది. కానీ దొరకలేదని ఆటపట్టిస్తాడు. జుంకా కనపడట్లేదని బాధపడుతున్న రిషి ని చూసి, వసుధార కంగారు పడుతుంది అక్కడ తో ఈరోజు ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now