Guppedantha Manasu November 9th Episode : రిషి మీద ఏంజెల్ ఫైర్‌, విశ్వ‌నాథం ఇంట్లో అనుప‌మ, శైలేంద్ర దొరికిపోతాడా..?

November 9, 2023 8:54 AM

Guppedantha Manasu November 9th Episode : గతాన్ని మొత్తం, ఏంజెల్ విశ్వనాథం ముందు బయట పెడతాడు. జగతి, మహేంద్ర తన తల్లిదండ్రులేనని చెప్పేస్తాడు. జగతి కోరిక మేరకే వసుధారని, పెళ్లి చేసుకున్నట్టు కూడా చెప్తాడు. కానీ, ఏంజెల్ మాత్రం రిషి చెప్పింది కట్టు కథ అనుకుంటుంది. రిషి అబద్దం చెప్తున్నాడని, అపోహ పడుతుంది. నువ్వు చెప్పింది నిజమని ఎలా నమ్మాలి అని, నిలదీస్తుంది. రిషి చెప్పినవన్నీ నిజాలు అని, వసుధార చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఒక మహారాజు తన కిరీటం పోగొట్టుకుని, రోడ్డుమీదకి వచ్చినప్పుడు, ఎవరు నువ్వు అని అడిగితే కిరీటాన్ని కోల్పోయిన రాజు అని ఎలా చెప్పగలరు అని అంటుంది.

రిషి చెప్పకపోతే, నువ్వు ఎందుకు నిజాలు దాచి పెట్టావని వసుధారని అడుగుతుంది. ఏంజెల్ మీ ఇద్దరికీ పరిచయం ఉందా, గతం ఉందా అని చాలా సార్లు అడిగితే, సమాధానం ఇవ్వలేదని అంటుంది. రిషి సార్ కోసమే ఈ నిజాలు చెప్పకుండా, దాచి పెట్టినట్లు ఏంజెల్ కి వసుధార చెప్తుంది. మా మధ్య వున్నది ప్రేమ అనే నిజం, చాలా సార్లు చెప్పాలనుకున్నానని, వసుధార అంటుంది, ఒకరి కోసం మేము పుట్టామని చెప్పాలనిపించింది. కానీ, తన గతాన్ని ఎవరికీ చెప్పకూడదని రిషికి ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రేమని బయట పెట్టలేదు అని చెప్తుంది.

నన్ను భార్యగా రిషి సార్ అంగీకరించారు కాబట్టి, ఈరోజు నిజాలని చెప్తున్నాను అని అంటుంది. రిషి స్టూడెంట్ ని ఆయన కాలేజీలోనే చదువుకున్నాను అని కూడా చెప్తుంది. ప్రేమ కథ మొత్తం, ఏంజెల్ కి చెప్పేస్తుంది వసుధార. తమది ఆత్మబంధం అని, అదే ప్రేమగా పెళ్లిగా మారిందని చెప్తుంది. నిజాలు అన్నీ బయటపెట్టిన కూడా, ఏంజెల్ మాత్రం వసుధార మాటలని నమ్మదు. విశ్వనాథం సర్ది చెప్తాడు. కాలేజీకి ఎలాంటి అవసరం ఉన్నా తాను వసుధార ఎప్పుడు కూడా అండగా ఉంటామని, విశ్వనాధానికి మాట ఇస్తాడు రిషి.

గొడవ జరుగుతున్నట్లుగా అనిపించడం, అనుపమ మేడ మీద నుండి కిందకి రావాలని అనుకుంటుంది, కానీ, అప్పుడే పెద్దమ్మ ఫోన్ చేస్తుంది. ఏంజెల్ ఈ బాధ నుండి బయటకి రావడానికి, చాలా టైం పడుతుందని అంటుంది. రిషి వసుధార వెళ్ళిపోయాక అనుపమ కిందకి వస్తుంది. అనుపమని చూసి విశ్వనాథం షాక్ అవుతాడు. ఇన్నాళ్ళకి నా మీద నీకు కోపం తగ్గిందా అని విశ్వనాథం ఎమోషనల్ అవుతాడు. ఆమె ఎవరో తెలియక ఏంజెల్ కంగారుపడుతుంది. నీకు అత్తయ్య అవుతుందని, ఏంజెల్ కి అనుపమ ని పరిచయం చేస్తాడు. అనుపమ విశ్వనాధాన్ని డాడీ అని పిలుస్తుంది.

Guppedantha Manasu November 9th Episode today
Guppedantha Manasu November 9th Episode

మహేంద్ర ఒంటరిగా ఇంట్లో ఉంటాడు. ఆ ఒంటరితనాన్ని భరించలేక మందు తాగాలని అనుకుంటాడు. రిషి కి మాట ఇచ్చిన విషయం జగతి గుర్తు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. నువ్వు నాకు కనపడ్డ కనపడకపోయినా ఎప్పుడూ నాతోనే ఉంటావని జగతిని గుర్తు చేసుకుని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. నేను తాగితే నాన్నని ఎందుకు తాగనిచ్చావు అని రిషి ని అడుగుతాడు. కొడుకు ముందు నువ్వు తలదించుకోకూడదని, జగతి ఫోటో చూస్తూ మహేంద్ర చెప్తాడు. అనుపమ పదే పదే జగతికి ఫోన్ చేస్తోందని, చనిపోయావని నిజం ఎలా చెప్పాలో తెలియట్లేదు అని, అందుకు అనుపమ నుండి తప్పించుకుని తిరుగుతున్నానని మహేంద్ర అంటాడు.

నన్ను నువ్వు వదిలిపెట్టి జ్ఞాపకంగా మిగిలిపోతావని ఊహించలేదని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అనుపమ తన వస్తువుని సర్దుకుంటుంది. అందులో నుండి జగతి మహేంద్ర లతో తను కలిసి ఉన్న ఫోటో కింద పడుతుంది. ఆ ఫోటోని ఏంజెల్ చూడాలని అనుకుంటుంది. కానీ అనుపమ వద్దని అంటుంది. నీలాగే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఏది అడిగినా పర్సనల్ అని చెప్పి, చివరికి షాక్ ఇచ్చాడని రిషి గురించి అనుపమకి ఏంజెల్ చెప్తుంది. అతని ఎవరు అని అడిగితే, చెప్పను అని సెటైర్ వేస్తుంది ఏంజెల్. శైలేంద్ర కుట్లని వివరిస్తూ, రిషికి రాసిన లెటర్స్ ని విష్ కాలేజ్ ప్రిన్సిపల్ చూస్తాడు. రిషికి అందజేయమని పాండియన్ కి చెప్తాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now