Railway Rule : రైలులో ఇక‌పై ఈ వ‌స్తువుల‌ను తీసుకెళ్ల‌రాదు.. అలా చేస్తే ఫైన్ ప‌డుతుంది జాగ్ర‌త్త‌..!

November 12, 2023 10:53 AM

Railway Rule : చాలామంది, ఎక్కువగా రైలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. రైలు ప్రయాణం చేసినప్పుడు కూడా కొన్ని రూల్స్ ని ఖచ్చితంగా పాటించాలి. రైలు లో ట్రావెల్ చేసినప్పుడు రూల్స్ ని కనుక పాటించకపోతే, కచ్చితంగా జరిమానా పడడం, జైలు శిక్ష వంటివి ఉంటుంటాయి. దీపావళి పండుగని దృష్టి లో పెట్టుకుని, భారతీయ రైల్వేస్ రైలు ప్రయాణికుల కోసం కొత్త రూల్స్ ని అమలు చేసింది. ఈ పండుగ సీజన్లో ప్రయాణికుల భద్రతా సౌకర్యాన్ని దృష్టి లో పెట్టుకొని ఈ రూల్స్ ని తీసుకువచ్చింది. ఇండియన్ రైల్వే రైల్లో పటాకులు వంటివి తీసుకు వెళ్లకూడదు, మండుతున్న వస్తువుల్ని తీసుకెళ్లడని నిషేధించింది.

దీపావళి పండగ దగ్గర పడింది. దీపావళి కి చాలా మంది ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి వెళుతూ ఉంటారు. సిటీస్ లో ఉండే వాళ్ళు ఇళ్ళకి రావడం, ప్రియమైన వారి కోసం ట్రావెల్ చేసి వెళ్లడం, వంటివి చేస్తూ ఉంటారు. దీనితో రద్దీ కూడా పెరుగుతుంది.

Railway Rule do not take them from now
Railway Rule

రైల్వే శాఖ అందుకని ప్రవేశపెట్టిన నిబంధన విషయానికి వస్తే.. పటాకులు లేదంటే అలాంటి వస్తువులని ట్రైన్ లో తీసుకెళ్లడం తప్పు అని, ప్రయాణికుల భద్రత ప్రమాదాలు దృష్టిలో పెట్టుకుని ఈ రూల్ ని ఇండియన్ రైల్వేస్ తెచ్చింది. ఒక వేళ కనుక ప్రయాణికులు తప్పు చేసినట్లయితే , రైల్వే చట్టం లోని సెక్షన్ 164 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

ఈ నియమాన్ని పాటించక పోతే , ఆ వ్యక్తి కి మూడు సంవత్సరాలు జైలు శిక్ష, లేదంటే వెయ్యి జరిమానా. లేకపోతె రెండు పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. కచ్చితంగా ప్రయాణికులు ఈ నిబంధనని పాటించాలి. ప్రయాణం లో బాణసంచా తీసుకెళ్లద్దని ఇండియన్ రైల్వేస్ కోరుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now