---Advertisement---

Pulipirlu : పులిపిర్లు అస‌లు ఎందుకు వ‌స్తాయి..? వీటికి ప‌రిష్కారం ఏది..?

November 6, 2023 1:37 PM
---Advertisement---

Pulipirlu : పులిపిరి సమస్యతో చాలా మంది బాధ పడుతూ ఉంటారు. పులిపిరి ఎందుకు వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పులిపిర్లు, నల్ల మచ్చలు వంటి వాటి గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి. చిన్న చిన్న చిట్కాలతో, పులిపిర్లు అయినా పుట్టుమచ్చలైన లేదంటే మొటిమలు అయినా కూడా తగ్గి పోతాయి. చాలా మందికి, పుట్టు మచ్చలు పెద్ద పెద్దగా వచ్చేస్తూ ఉంటాయి. తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. పులిపిర్లు కాళ్లు, చేతులు, మెడ మీద ముక్కు మీద ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళని వీటిని గిల్లకూడదు.

ఒకవేళ కనుక మీరు గిల్లినట్లయితే, ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. అసలు ఈ పులిపిర్లు ఎందుకు వస్తాయి అనే విషయానికి వచ్చేస్తే… చాలామందికి వస్తూ ఉంటాయి కానీ అందరికీ రావు. మెంటల్ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, ఒంట్లో తగినంత ఇమ్యూనిటీ పవర్ లేకపోతే ఇన్ఫెక్షన్ ఏర్పడి, ఈ పులిపిర్లు వస్తాయి.

Pulipirlu home remedies in telugu
Pulipirlu

ఈ సమస్య పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలలో ఉంటుంది, హార్మోన్స్ వలన ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. శాశ్వతంగా పోయే చిట్కా ఒకటి ఉంది. ఇక ఈ చిట్కా గురించి చూస్తే, తమలపాకు కడిగి తొడిమకు కొంచెం కింద దాకా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు వేసుకోండి.

దానిలో కొంచెం సున్నం కలిపి, ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో, తమలపాకు తొడిమతో అక్కడ పెట్టాలి. ఇక్కడ మీరు సున్నాన్ని స్కిన్ కి పెట్టేటప్పుడు, తమలపాకుతో మాత్రమే పెట్టండి. తమలపాకు తొడిమతో సున్నం తీసి, పులిపిరి ఉన్నచోట రాస్తే, పులిపిరి రాలిపోతుంది. రాలిపోయిన తర్వాత, ఆ మచ్చ పోవడానికి కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి రాసుకోండి. ఈజీగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now