Masala Tea : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే విధంగా మసాలా టీ.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!

October 31, 2023 12:38 PM

Masala Tea : ప్రతి ఒక్కరు కూడా, టీ ని ఇష్టపడుతూ ఉంటారు. టీ, కాఫీలు ని చాలామంది ఎక్కువసార్లు రోజుల్లో తీసుకుంటూ ఉంటారు. టీ, కాఫీ తీసుకుంటే, ఏదో తెలియని ఎనర్జీ మనలో వస్తుంది. అధిక మోతాదులో తీసుకుంటే, ఆరోగ్యానికి ఇబ్బంది. కానీ లిమిట్ గా తీసుకుంటే ఎటువంటి నష్టం ఉండదు. అయితే, ఇలా కనుక మీరు టీ ని తయారు చేశారంటే కచ్చితంగా ఇంట్లో వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు. మంచి రంగు, రుచి, వాసన కలిగిన టీ ఇది. టీ ని ఎలా తయారు చేసుకోవాలి..? ఎలా ఇంట్లో వాళ్ళని ఫిదా చేసేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం.

పాలు బాగా మరిగేంత వరకు కూడా లో ఫ్లేమ్ లో పెట్టి, పాలను బాగా మరిగించండి. ఆ తర్వాత పాలను తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పొయ్యి మీద పెట్టి, రెండు కప్పులు నీళ్లు పోసుకోండి. నీళ్లు బాగా మరిగేంత వరకు మూత పెట్టి, మరిగించుకోండి. చెక్కు తీసిన అల్లాన్ని కొంచెం దంచేసి వేసుకోండి. ఒక నాలుగు, ఐదు యాల‌కులను కూడా ఈ నీళ్లలో వేసేయండి. ఒక నాలుగు లవంగాలని కూడా వేసుకోండి.

Masala Tea recipe very good taste make like this
Masala Tea

కొంచెం దాల్చిన చెక్కను కూడా వేసుకోండి. అలానే మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదారని వేసుకోండి. రెండు టేబుల్ స్పూన్ల టీ పొడి కూడా వేసుకోండి. టీ పొడి వేసాక మూత పెట్టేసుకోండి. బాగా తయారవుతుంది. ఇది బాగా మరిగిన తర్వాత, కాచిన పాలని రెండు కప్పులు పోసుకోవాలి.

పాలు వేసేటప్పుడు చల్లటి పాలని ఎప్పుడూ మిక్స్ చేయకండి. గోరువెచ్చని పాలు నయినా తీసుకోవచ్చు. కానీ, చల్లటి పాలని తీసుకోవద్దు. ఇది మరిగించుకున్నాక, గులాబీ రేకుల్ని వేసుకోండి, ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోండి. తర్వాత ఒక గరిటను తీసుకుంటూ కలుపుతూ మళ్ళీ మరిగించుకోండి. ఇక, వడకట్టుకుని వేడివేడిగా టీ ని ఆస్వాదించడమే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now