శ‌నివారం నాడు ఈ 5 ప‌నులు చేయండి.. దుర‌దృష్టం పోతుంది..!

October 23, 2023 5:32 PM

ఒకసారి, శని తగిలింది అంటే, ఏ పని కూడా పూర్తి కాదు. అనుకున్న పనులు ఏమి జరగవు. పైగా, ఎన్నో ఇబ్బందులు ప్రతిదానిలో కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, అటువంటి శనిగ్రహం ని, సంతోష పెట్టి, మీరు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే, ఇలా చేయండి. శనికి కోపం వచ్చిందంటే, కచ్చితంగా నాశనం చేస్తుంది. ఇదంతా జాతకంలో శని స్థానంపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయం మనకు తెలుసు. అయితే, ఇతర గ్రహాలు లానే శని కూడా ఇతర రాశుల వాళ్ళతో ప్రయాణిస్తుంది.

ఒక రాశి నుండి మరో రాశికి ప్రవేశించడానికి, రెండున్నర సంవత్సరాలు పడుతుంది. శని రాశి సమయంలో, వివిధ రాశి చక్రాలు ఉన్న వ్యక్తులు, అనేక రకాల పరిస్థితులను ఎదుర్కోవాలి. కొంతమందికైతే, శని కారణంగా మంచి జరుగుతూ ఉంటుంది. ఇంకొంతమందికి, కఠిన పరిస్థితి ఎదుర్కోవాలి. శని అశుభ స్థానం వలన, కెరియర్ లో అంతరాయం కలిగిస్తుంది. శారీరిక, మానసిక, ఆర్థికంగా కూడా నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

do like this on saturday to remove bad luck

శని దేవుని వలన జీవితంలో, అన్ని సమస్యలు జరుగుతున్నట్లు అనిపిస్తే, శని నివారణ చర్యల ద్వారా, ఆయనని మనం సంతోష పెట్టవచ్చు. పురాణాల ప్రకారం, హనుమంతుడిని ఆరాధించడం వలన శని దేవుడు బాధ తగ్గుతుంది. శని దేవుడు హనుమాన్ కి తన భక్తులకి ఎప్పుడూ ఇబ్బంది పెట్టనని, వాగ్దానం చేశారట.

రావి చెట్టుకి పూజ చేయడం వలన కూడా శని బాధల నుండి బయటపడవచ్చు. శని దేవుడు సంతోషంగా ఉంటారు. శనివారం నాడు, ఆవ నూనె ని దానం చేస్తే కూడా, మంచి జరుగుతుంది. శని మంత్రాలని జపిస్తే కూడా, శని సంతోషపడతారు.’ ఓం ప్రాం ప్రీం ప్రౌన్ సహ శనీశ్వరాయ నమః’, ‘ఓం శనీశ్వరాయ నమః’ జపించండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now