Coconut Offering To God : మహిళలు కొబ్బరికాయని కొట్టకూడదా..? పురుషులే కొట్టాలా..? కారణం ఏమిటి..?

October 22, 2023 5:52 PM

Coconut Offering To God : ఇంట్లో ఏదైనా పూజ చేసినా, లేదంటే ఆలయాలకి వెళ్ళినా, కొబ్బరికాయని కొడుతూ ఉంటాము. అలానే, ఏదైనా శుభకార్యాలప్పుడు కూడా, కొబ్బరికాయని కొడుతూ ఉంటాము. అయితే. మహిళలు పూజలు చేస్తున్నప్పుడు దేవాలయంలో కొబ్బరికాయల్ని కొట్టడం మనం చూస్తూ ఉంటాం. అయితే, పూజా కార్యక్రమాల్లో, దేవాలయాల్లో ఎందుకు మహిళలు కొబ్బరికాయని కొట్టకూడదు..? దీని వెనుక కథ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హిందువులు కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. శుభకార్యాలప్పుడు కచ్చితంగా కొబ్బరికాయని కొడతారు.

కొబ్బరికాయని కొట్టి నైవేద్యంగా దేవుడికి సమర్పిస్తారు. అయితే, భార్య భర్తలు ఇద్దరూ ఉన్నప్పుడు ఎక్కువగా భర్తలు అంటే పురుషులు, కొబ్బరికాయని కొడుతూ ఉంటారు. స్త్రీలు తక్కువగా కొడుతూ ఉంటారు. కొబ్బరి నీళ్లు చంద్రుని చిహ్నంగా ఉంటుంది. దాన్ని దేవుడికి సమర్పించడం వలన సుఖం, శ్రేయస్సు కలుగుతాయి. బాధలు, దుఃఖం వంటివి తొలగిపోతాయి. హిందూమతంలో మహిళలు కొబ్బరికాయల్ని కొట్టడం నిషేధించబడింది. అందుకు కారణం ఇది ఒక విత్తనం. స్త్రీలు సంతానానికి కారకులు.

Coconut Offering To God important facts to know
Coconut Offering To God

వాళ్ళు ఒకే విత్తనం నుండి సంతానాన్ని కలిగి ఉంటారు. అందుకే, స్త్రీలు ఎప్పుడు కొబ్బరికాయని కొట్టరు. మహిళల కొబ్బరికాయల్ని కొట్టడం వలన, పిల్లల జీవితాలు లో అనేక సమస్యలు వస్తాయని అంటారు. విష్ణువు తల్లి లక్ష్మీ భూమిపై కొబ్బరి చెట్లని నాటినట్లు చెప్పడం జరుగుతుంది. కొబ్బరికాయ విష్ణువు, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. అందుకనే పూజా విధానంలో కొబ్బరికాయని ఉపయోగిస్తారు. చాలామంది మహిళలు అసలు కొబ్బరికాయని కొట్టారు.

అరుదుగా మాత్రమే మహిళలు కొబ్బరికాయని కొడుతుంటారు. పైగా, కొబ్బరికాయని కొట్టడానికి కొంచెం శక్తి కావాలి. పురుషులు శక్తివంతులు అని కొబ్బరికాయని అప్పట్లో పురుషులు మాత్రమే కొట్టేవారు. ఇప్పుడు అందరూ సమానం అని అంటున్నారు. అందుకే, మహిళలు కూడా కొబ్బరికాయల్ని కొడుతున్నారు. అయితే, మహిళలు కొబ్బరికాయని కొట్టకూడదు అని ఎక్కడ చెప్పలేదు. పైగా మహిళలు కొబ్బరికాయని కొట్టడానికి తప్పుగా కూడా పరిగణించరు. స్త్రీలు కూడా కొబ్బరికాయని కొట్టడానికి అనుమతిస్తూ ఉంటారు. ఒకప్పుడు మాత్రం స్త్రీలని కొబ్బరికాయ కొట్టొద్దు అని చెప్పేవారు. కానీ ఇప్పుడు అలాంటిదేమీ కూడా లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now