Lunar Eclipse : అక్టోబర్ 28 చంద్రగ్రహణం.. ఈ 4 రాశుల వాళ్ళకి రాజయోగం.. మీ రాశి కూడా ఉందేమో చూడండి..!

October 21, 2023 3:49 PM

Lunar Eclipse : చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వంటివి వచ్చినప్పుడు, కొన్ని నియమాలని పాటిస్తూ ఉంటాము. గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయకుండా, దైవానుగ్రహాన్ని పొందడం కోసం, చాలామంది శ్లోకాలు వంటివి చదువుతూ ఉంటారు. అక్టోబర్ 28న పాక్షిక చంద్రగ్రహణం. అయితే, చంద్రగ్రహణం సందర్భంగా అఖండ రాజయోగం ఈ నాలుగు రాశుల వాళ్ళకి పట్టబోతోంది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. అక్టోబర్ 28వ తేదీ, శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ఐదు నిమిషాలకి రాహు గ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం ఉంది.

అశ్విని నక్షత్రం మేష రాశిలో ఏర్పడుతుంది ఈ గ్రహణం. అంటే, ఈ రాహు గ్రస్తపాక్షిక చంద్రగ్రహణం ప్రారంభమయ్యే సమయం స్పర్శ కాలం అక్టోబర్ 28 శనివారం అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలు. ఈ గ్రహణం అర్థరాత్రి రెండు గంటల 23 నిమిషాలకి పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. మోక్షకాలం రెండు గంటల 23 నిమిషాలు. ఈ గ్రహణం మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. అశ్విని నక్షత్రం ఒకటి, రెండు, మూడు నాలుగు పాదాల వాళ్ళు, భరణి నక్షత్రం ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదాల వాళ్ళు, అలానే కృత్తిక నక్షత్రం ఒకటవ పాదం వాళ్ళు, ఈ గ్రహణాన్ని చూడకూడదు అని పండితులు చెప్తున్నారు.

these zodiac persons will get luck because of Lunar Eclipse
Lunar Eclipse

ఈ రాహు గ్రస్తపాక్షిక చంద్రగ్రహణం 12 రాశులలో నాలుగు రాశుల వాళ్ళకిm అఖండ రాజయోగాన్ని తీసుకు వస్తోంది. జ్యోతిష్య శాస్త్రం పరంగా, ఎప్పుడైనా కూడా గ్రహణ గోచారం అనేది ఉంటుంది. గ్రహణం వలన మనకు కలిగేటువంటి రాజయోగాన్ని, ఈ గ్రహణ గోచారం తెలుపుతుంది. జన్మరాశి నుండి లెక్కపెట్టినప్పుడు వచ్చే మూడవ రాశిలో కానీ, ఆరవరాశలో కానీ, పదవ రాశిలో కానీ లేదంటే 11 వ రాశిలో కానీ గ్రహణం వచ్చినట్లయితే, అఖండ రాజ యోగాన్ని తీసుకువస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు.

కుంభ రాశి వాళ్ళకి ఈ గ్రహణంతో రాజయోగం పట్టబోతోంది. అలానే, వృశ్చిక రాశి వాళ్ళకి కూడా అఖండ రాజయోగం కలగబోతోంది. వృశ్చిక రాశి వాళ్ళకి అప్పుల బాధలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. కర్కాటక రాశి వాళ్ళకి కూడా, రాజయోగం కలగనుంది. మిధున రాశి వాళ్ళకి కూడా అఖండ రాజు యోగం కలగబోతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now