Healthy Sweets : ఆరోగ్య‌వంతమైన స్వీట్స్ ఇవి.. ఈ ద‌స‌రాకి వీటిని చేసుకుని తినండి..!

October 18, 2023 3:14 PM

Healthy Sweets : దసరా పండుగని, తొమ్మిది రోజులు పాటు, ఘనంగా జరుపుతూ ఉంటారు హిందువులు. దసరా పండగ అంటే, మొట్టమొదట మనకు గుర్తొచ్చేది అమ్మవారిని పూజించడం. అలానే, ఉపవాసం, ఆహార పదార్థాలను తీసుకోవడం ఇలా ఎన్నో.. అయితే, ఏ పండుగకైనా సరే స్వీట్లు ప్రత్యేకము. ముఖ్యంగా, దసరా పండుగకి స్వీట్లు కచ్చితంగా పెడతారు. నవరాత్రి నాడు, ఆరోగ్యానికి మేలు చూసే ఆరు స్వీట్లు గురించి మేము వివరించాము. వీటిని మీరు పాటించినట్లయితే, ఆరోగ్యంగా ఉండొచ్చు. హెల్త్ కి ఎటువంటి హాని కూడా వీటి వలన కలుగదు.

ఆరోగ్యానికి మేలు చేసే స్వీటులా అని ఆశ్చర్యపోవద్దు. వీటిని చూశారంటే, కచ్చితంగా మీరు కూడా ఈ నవరాత్రి టైంలో తింటారు. ఫ్రూట్ చాట్ వలన, ఎలాంటి నష్టం కలగదు. ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. పండ్లను ముక్కలు కింద కట్ చేసి, మనం సాల్ట్, నిమ్మరసం, షుగర్, జీలకర్ర పొడి వేసి టాస్ చేసుకుని తీసుకుంటే, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరికైనా సరే పండ్లు పెట్టొచ్చు. పైగా పండ్ల వలన ఉపయోగాలే తప్ప. నష్టాలు ఉండవు.

Healthy Sweets take them for this dasara
Healthy Sweets

ఖర్జూరం పండ్లు తీసుకుంటే కూడా, ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు. నట్స్ తో చేసిన బర్ఫీ తీసుకుంటే కూడా, ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు. జీడిపప్పు, బాదం, పిస్తా తో మీరు బర్ఫీ తయారు చేసుకోవచ్చు. మఖాన కీర్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పోషకాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. ఈ దసరాకి టేస్టీగా, ఆరోగ్యంగా ఉండే ఈ స్వీట్ ని కూడా, మీరు ట్రై చేయొచ్చు.

అలానే, సాములతో కీర్ తయారు చేసుకోవచ్చు. సాములు, బియ్యం కీర్ చాలా టేస్టీగా ఉంటుంది. పైగా, ఆరోగ్యం కూడా, కొబ్బరి లడ్డులు కూడా ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవు. కొబ్బరి లడ్డూలని కూడా, మీరు దసరా సందర్భంగా తయారు చేసుకోవచ్చు. రాజగిరి గింజలతో కూడా లడ్డూలు తయారు చేసుకోవచ్చు. ఇవి కూడా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు. ఇలా, వీటిని మీరు దసరాకి తయారు చేసుకుని తీసుకుంటే, ఆరోగ్య సమస్యలు ఏమి కూడా వుండవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now