Acidity Home Remedies : ఈ చిట్కాల‌ను పాటించండి చాలు.. క‌డుపులో మంట ఇట్టే త‌గ్గిపోతుంది..!

October 5, 2023 7:59 PM

Acidity Home Remedies : తరచూ మనకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి తిన్నది సరిగ్గా జీర్ణం కూడా అవ్వదు. అదేపనిగా తేన్పులు రావడం, ఆహారం జీర్ణం అవ్వకపోవడం ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. ఎసిడిటీ వలన ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. ఎసిడిటీ నుండి ఈజీగా బయటపడాలంటే, ఇలా చేయండి. ఇలా చేయడం వలన ఈజీగా ఎసిడిటీ సమస్య నుండి బయటపడవచ్చు. కడుపు ఉబ్బరంగా వున్నా, ఊరికే తేన్పులు వస్తున్నా, లేదంటే తిన్నది సరిగ్గా అరగలేదు అనిపించినా పెద్దకా కంగారు పడక్కర్లేదు.. సింపుల్ గా ఇంటి చిట్కాలతో మనం ఉపశమనాన్ని పొందవచ్చు. మరి అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

దీనికోసం ఎండు ద్రాక్ష పండ్లు తీసుకోండి. రాత్రిపూట, నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకుంటే, జీర్ణశక్తి పెరుగుతుంది. పేగుల పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్ సంబంధిత సమస్యల్ని, దూరం చేసుకోవచ్చు. రాత్రి అన్నం లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, గోరువెచ్చని పాలు పోసి తోడు పెట్టుకోండి. ఉదయాన్నే, అల్పాహారం కింద దీన్ని తీసుకోండి. ఇలా చేయడం వలన ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి.

Acidity Home Remedies works effectively
Acidity Home Remedies

మంచి బ్యాక్టీరియా పేగుల్లోకి వెళ్తుంది. ఎసిడిటీ బాధ ఉండదు. గులాబీ రేకుల్ని ప్రాసెస్ చేసి, తయారు చేసిన గుల్కండ్ కూడా, బాగా ఉపయోగపడుతుంది. రాత్రిపూట పడుకోవడానికి ముందు, ఈ గుల్కండ్ వాటర్ ని తాగండి. ఎసిడిటీ సమస్యల నుండి ఈజీగా బయటకి వచ్చేయొచ్చు.

కలబంద గుజ్జు తీసి, నీటిలో కలిపి పల్చటి జ్యూస్ లాగ చేసుకుని తాగితే కూడా ఈ సమస్య నుండి బయట పడచ్చు. కావాలంటే, మీకు స్టోర్స్ లో డైరెక్ట్ గా దొరుకుతుంది. అదైనా కొనుగోలు చేసి తీసుకోవచ్చు. రోజులో ఎప్పుడు గ్యాస్ అనిపించినా, వేడి నీటిని కానీ గోరువెచ్చని నీటిని కానీ తీసుకోండి వెంటనే తగ్గుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now