Moong Dal Face Pack For Beauty : పెసర పప్పు ప్యాక్‌తో మొటిమలు, మచ్చలు మాయం.. ఫేషియల్ హెయిర్ కూడా…!

October 4, 2023 5:31 PM

Moong Dal Face Pack For Beauty : చాలామంది ఇళ్లల్లో పెసరపప్పుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కందిపప్పు లానే పెసరపప్పుతో కూడా, రకరకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, పెసరపప్పు బాగా ఉపయోగపడుతుంది. క్వీన్ అఫ్ పల్సస్ అని పెసరపప్పుని అంటారు. ఇందులో ప్రోటీన్, పొటాషియంతో పాటుగా ఐరన్, విటమిన్స్ మొదలైన పోషకాలు కూడా ఉంటాయి. పెసరపప్పులో ఫ్లెవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్, ఆర్గానిక్ ఆసిడ్స్ కూడా ఉంటాయి. లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్ కూడా ఇందులో ఉంటాయి.

పెసరపప్పు తీసుకుంటే, ఆరోగ్య ప్రయోజనాలతో పాటుగా సౌందర్యాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. పెసరపప్పులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబెల్ గుణాలు చర్మ సమస్యలను దూరం చేయడానికి, బాగా ఉపయోగపడతాయి. పెసరపప్పు ద్వారా అందమైన చర్మాన్ని పొందవచ్చు. నాలుగు టీ స్పూన్లు పెసరపప్పు తీసుకుని, రెండు గంటలు పాటు నానబెట్టి, తర్వాత పెసరపప్పు పేస్ట్ చేసి, ఇందులోనే కమల తొక్కల పొడి, గంధం పొడి మిక్స్ చేసి, పేస్ట్ లాగా చేసుకుని, ముఖానికి పట్టించి, 10 నిమిషాల పాటు అలా వదిలేయండి.

Moong Dal Face Pack For Beauty apply regularly for glow
Moong Dal Face Pack For Beauty

ఆరిపోయిన తర్వాత నీటితో కడిగేసుకుంటే, కాంతివంతమైన చర్మాన్ని పొందొచ్చు. అదే డ్రై స్కిన్ ఉన్నవాళ్లు, పెసరపప్పు ని పచ్చి పాలల్లో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం నానబెట్టిన పప్పుని గ్రైండ్ చేసి, పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ ని ముఖానికి బాగా పట్టించి, 15 నిమిషాలు ఆరపెట్టి, తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే, ముఖం మృదువుగా మారిపోతుంది.

పెసరపప్పు చర్మ రంధ్రాల్లో ఉండే మురికిని, నూనెని కూడా తొలగిస్తుంది. పెసరపప్పు ఫేషియల్ హెయిర్ ని కూడా తొలగించగలదు. పెసరపప్పు పేస్ట్ లో నారింజ తొక్కల పొడి, గంధం పొడి వేసి కొంచెం పాలు కూడా వేసుకొని, ముఖానికి పట్టించాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేయడం వలన ఫేషియల్ హెయిర్ తొలగిపోతుంది. ఇలా అందంగా మారవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now