Elinati Shani : ఏలినాటి శ‌ని అంటే ఏమిటి.. దీన్ని ఎలా తొల‌గించుకోవాలంటే..?

September 29, 2023 9:35 PM

Elinati Shani : ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. అయితే, ఒక్కొక్కసారి జాతక ప్రభావం వలన ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది, ఏలినాటి శని ప్రభావం నడుస్తుందని అంటూ ఉంటారు. శని తన సొంత రాశిలో ప్రవేశించినప్పుడు, కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం పడుతుంది. ఇతర గ్రహాల కన్నా శని నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. ఈ కారణంగా, శని ప్రభావం ఎక్కువగా ఆయా రాశుల వాళ్ళకి ఉంటుంది.

శని, బుధుడు, శుక్రుడు రాహువులతో స్నేహపూర్వకంగా ఉంటాడు. న్యాయం, ప్రేమ చర్యలకు అనుకూలంగా ఫలితాలని శని ఇస్తాడు. శని శాపం కనుక తగిలిందంటే, చెడు ప్రభావాలు కచ్చితంగా పడతాయి. శనిని పాపపు లేదా క్రూరమైన గ్రహంగా భావించడం జరుగుతుంది. శని సూర్య ,చంద్ర. అంగారకులతో శత్రుత్వాన్ని కలిగి ఉంటారు. బృహస్పతి కేతువులతో కూడా అలానే.

Elinati Shani how to remove it vastu remedies
Elinati Shani

మకర, కుంభరాశులకి అధిపతి శని. ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి మారడానికి లేదంటే బదిలీ కావడానికి రెండున్నర ఏళ్ల సమయం పడుతుంటుంది. ఇలా, దాదాపు 30 ఏళ్లలో తన చక్రాన్ని పూర్తి చేసుకుంటాడు శని. ప్రస్తుతం అయితే, ధనస్సు రాశి వాళ్ళకి, మకర కుంభ రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంది. కనుక, ఈ రాశి వాళ్ళకి ఇబ్బందులు రావచ్చు. నిజానికి, చాలామంది ఏలినాటి శని అంటే భయపడిపోతూ ఉంటారు. శని దోషాలను నివారించడానికి రావి చెట్టు కింద నువ్వుల నూనె, ఆవనూనెతో దీపాన్ని పెట్టడం మంచిది.

ప్రతిరోజు రావి చెట్టుకి 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. 11 ప్రదక్షిణాలు చేస్తూ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. హనుమంతుడిని కూడా భక్తితో ఆరాధించాలి. హనుమాన్ చాలీసా కానీ సుందరకాండ ని కానీ పారాయణం చేయాలి. ఆంజనేయ స్వామిని పూజించితే, శని దోష నివృత్తి కలుగుతుంది. శనివారం శని దేవుడికి సంబంధించిన వస్తువులని దానం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now