Viral Video: దారిలో వెళ్తున్న కారుపై దూకిన పాము.. ఇంజిన్‌లోకి చొర‌బ‌డింది..!

July 11, 2021 3:58 PM

పాముల‌ను చూస్తేనే స‌హ‌జంగానే చాలా మందికి పై ప్రాణాలు పైనే పోతాయి. ఇక అవి వెంట పడితే విప‌రీత‌మైన భ‌యం క‌లుగుతుంది. పాములు ఆమ‌డ దూరంలో ఉంటేనే చాలా మంది జంకుతారు. ఇక అవి ద‌గ్గ‌ర‌కు వ‌స్తే అంతే సంగ‌తులు. దూరంగా పారిపోతారు. అయితే ఓ కారులో ప్ర‌యాణిస్తున్న వారికి కూడా స‌రిగ్గా ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

python jumps on car and slept on engine

సౌతాఫ్రికాలోని క్రుగ‌ర్ నేష‌న్ పార్క్ అది. అక్క‌డ కొంద‌రు ప‌ర్యాట‌కులు కారులో రోడ్డు మీద ప్ర‌యాణం చేస్తూ ఆగారు. మార్గ‌మ‌ధ్య‌లో ఓ కొండ చిలువ రోడ్డుపై వ‌చ్చి పోయే వాహ‌నాల మీద‌కు దూకేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే దానికి ఒక వైపు ఆగి ఉన్న కారును అది గ‌మ‌నించి అందులో ఇంజిన్‌లోకి ప్ర‌వేశించింది. దీంతో ఆ కారును వారు ఆపి ముంద‌ట బాయ్‌నెట్ తెరిచారు. అక్క‌డ ఇంజిన్ మీద ఎంచ‌క్కా ఆ కొండ చిలువ ప‌డుకుని ఉండ‌డాన్ని వారు గ‌మ‌నించారు.

అయితే వారు దాన్ని చంప‌లేదు. అది ఇంజిన్‌లోకి వెళ్లేందుకు య‌త్నించింది. దీంతో ఓ వ్య‌క్తి దాన్ని ప‌ట్టుకుని ప‌క్క‌నే ఉన్న పొద‌ల్లోకి విడిచిపెట్టాడు. కాగా అదే స‌మయంలో వీడియో తీసి దాన్ని యూట్యూబ్‌లో పోస్ట్ చేయ‌గా అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఎన్నో ల‌క్ష‌ల మంది ఆ వీడియోను ఇప్ప‌టికే వీక్షించారు. ఆ పామును చూస్తే చాలా భ‌యం క‌లుగుతుంద‌ని నెటిజ‌న్లు చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now