Dandruff Home Remedy : వేప ఆకులు, నిమ్మ‌ర‌సంతో ఇలా చేస్తే.. ఎంత‌టి మొండి చుండ్రు అయినా సరే త‌గ్గుతుంది..!

September 27, 2023 5:17 PM

Dandruff Home Remedy : చాలా మంది చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు. మీరు కూడా చుండ్రు సమస్యతో, బాధపడుతున్నారా..? చుండ్రుని వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నారా..? అయితే, ఇలా చేసి చూడండి. చుండ్రు వలన ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. బాగా దురద పెడుతూ ఉంటుంది. ఎంతో విసుగుగా ఉంటుంది. చాలా కాలం నుండి మీరు చుండ్రుతో బాధపడుతున్నట్లయితే, పైసా ఖర్చు లేకుండా, ఈజీగా మీరు చుండ్రు ని వదిలించుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

ఇలా చుండ్రుని ఈజీగా తొలగించుకోవచ్చు. అది కూడా ఈజీగానే. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా. వేప.. చుండ్రుని వదిలించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలానే, నిమ్మ కూడా బాగా ఉపయోగపడుతుంది. వేప, నిమ్మ లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఈ రెండు చుండ్రుని తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి. కొన్ని వేపాకులని నీళ్ళల్లో వేసి బాగా మరిగించి, పేస్ట్ కింద చేసుకోండి. అర చెక్క నిమ్మ రసం ఈ మిశ్రమం లో కలిపి, బాగా తలకి పట్టించండి.

Dandruff Home Remedy do like this with neem leaves and lemon juice
Dandruff Home Remedy

ఒక గంట తర్వాత మీరు కుంకుడుకాయ తో తల స్నానం చేయండి. లేదంటే, కుంకుడుకాయ ఉన్న షాంపూతో అయినా సరే తల స్నానం చేయొచ్చు. వారానికి మీరు రెండు, మూడు సార్లు దీనిని పాటిస్తే, చుండ్రు ఫుల్లుగా తగ్గిపోతుంది. చుండ్రు సమస్య నుండి ఈజీగా బయట పడొచ్చు.

ఇలా ఈజీగా పైసా ఖర్చు లేకుండా మనం చుండ్రు సమస్య నుండి బయటకి వచ్చేయొచ్చు. ఎలాంటి నష్టం కూడా ఉండదు. ఈజీగా కెమికల్స్ ఏమీ లేకుండా, సులువైన ఈ పద్ధతితో చుండ్రు సమస్యకు చెక్ పెట్టొచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు, చుండ్రు సమస్యతో మీరు కూడా బాధపడుతున్నట్లయితే, వెంటనే ఈ పద్ధతిని ఫాలో అయిపోండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now