ఓటీటీలో బిగ్ బాస్.. కీలక మార్పులు చేసిన నిర్వాహకులు!

July 10, 2021 2:00 PM

బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో కి ఉన్న క్రేజ్ మరే ఇతర షోలకు లేదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ వివిధ భాషలలో పలు సీజన్లలో ప్రసారమవుతుంది.తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే ఐదవ సీజన్ ప్రారంభించబోతుంది. అదేవిధంగా హిందీలో బిగ్ బాస్ ఏకంగా 15 వ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ కు హోస్ట్ గా సల్మాన్ ఖాన్ వ్యవహరించనున్నారు. తాజాగా ఈ బిగ్ బాస్ రియాలిటీ షో కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

హిందీలో బిగ్ బాస్ సీజన్ 15 త్వరలోనే ప్రసారం కానుంది. అయితే ఎప్పటిలా ఈ కార్యక్రమం టీవీలో కాకుండా ఈసారి నేరుగా ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ పేరులో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ ఓటీటీలో ప్రసారం కావడంతో దీనికి బిగ్ బాస్ ఓటీటీ అని పేరు మార్చారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన మొదటి ఆరు వారాలు మనకు టీవీలో కంటే ముందుగా ఓటీటీలో ప్రసారం కానుంది. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని టీవీలో ప్రసారం చేయనున్నారు. బిగ్ బాస్ సీజన్ 15 వూట్ ఓటీటీ ఫ్లాట్ఫామ్ వేదికగా ప్రసారం కానుంది. ఈ యాప్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లైఫ్ ఫీడ్‌ని 24X7 చూసే అవకాశం ఉంది. టీవీలో కంటే ముందుగానే ఈ కార్యక్రమాన్నిఓటీటీలో బిగ్ బాస్ అంటే డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లో ఇది ఒక చాలెంజ్ అని చెప్పవచ్చు.

బిగ్ బాస్ సీజన్ 15 ఆగస్టు నెలలో ఓటీటీలో ప్రసారం కాగా.. ఆ తర్వాత ఎప్పటిలాగే కలర్స్ ఛానల్ లో ప్రసారం కానుంది. అయితే మన తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోను ఈ విధంగా ఓటీటీలో ప్రసారం చేయడానికి ఏమాత్రం అవకాశాలు లేవు. హిందీతో పోల్చుకుంటే తెలుగులో ఓటీటీ వినియోగించేవారి శాతం తక్కువగా ఉండటంతో తెలుగులో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టీవీలోనే ప్రసారమవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now