Loan To Women : మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. వ‌డ్డీ లేకుండా రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..!

September 11, 2023 11:47 AM

Loan To Women : ఈరోజుల్లో చాలామంది వ్యాపారాల మీద దృష్టి పెట్టారు. మహిళలు కూడా వ్యాపారాలని మొదలు పెడుతున్నారు. మీరు కూడా మంచి వ్యాపారంతో మీ సొంత కాళ్ళ మీద నిలబడాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ప్రభుత్వం ఒక స్కీమ్ ని తీసుకువచ్చింది. మొదట కర్ణాటక ప్రభుత్వం ఈ స్కీమ్ ని తీసుకువచ్చింది. తర్వాత కేంద్రం దీనిని ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణలో దేశమంతటా కూడా తీసుకువచ్చింది. ఉద్యోగిని స్కీమ్ ద్వారా చాలామంది మహిళలు ప్రయోజనాన్ని పొందుతున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రామీణ ప్రాంత మహిళల ఆర్థిక స్వావలంబనకే ఎక్కువ ప్రాధాన్యత. ఈ పథకంతో వెనుకబడిన ప్రాంతాల్లోని మహిళలు వ్యవస్థాపకులుగా మారవ‌చ్చు. ఈ స్కీములో పేదలు నిరక్షరాస్య నేపథ్యాల నుంచి వచ్చిన మహిళలకి సపోర్ట్ వస్తుంది. ఈ స్కీము కింద ఇప్పటి వరకు 48 వేల మందికి పైగా మహిళలు లబ్ధి పొందారు. వ్యాపారాలు చేస్తున్నారు. 18 నుంచి 55 సంవత్సరాల వయసు వాళ్ళు ఈ స్కీముకి అర్హులు. కుటుంబ సంవత్సర ఆదాయం తప్పనిసరిగా రూ.1.50 లక్షలకు మించి వుండకూడదు.

Loan To Women no interest can take up to 3 lakhs
Loan To Women

అంగ వైకల్యం ఉన్నవారు, దళిత మహిళలు, వితంతువులకు అయితే ఈ స్కీము కింద వడ్డీ లేకుండానే లోన్ వస్తుంది. మిగిలిన మహిళలకు అయితే 10 నుంచి 12 శాతం వడ్డీ మీద లోన్ వస్తుంది. ఈ వడ్డీ బ్యాంకులను బట్టి మారుతుంది. కుటుంబ వార్షిక ఆదాయాన్ని బట్టి 30 శాతం దాకా సబ్సిడీ కూడా ఇస్తారు. లోన్ అమౌంట్ రూ. 3 లక్షలకు మించదు. ఎలాంటి సెక్యూరిటీ అక్కర్లేదు. వైకల్యం ఉన్నవారు, వితంతువుల‌కి వయో పరిమితి, కుటుంబ ఆదాయం పరిమితి ఉండదు.

మిగతా వాళ్ళు తప్పక సిబిల్ స్కోరు బాగా వుండేటట్టు చూడండి. దరఖాస్తు ఫారం, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోల‌తోపాటుగా ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు రేషన్ కార్డు కూడా ఇవ్వాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ ని కూడా ఈ స్కీముని పొందేందుకు కావాలి. ఈ స్కీము ప్రయోజనాలని పొందాలనుకునే వారు సమీపంలోని బ్యాంకుని సంప్రదించాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment