Alcohol : మ‌ద్యం సేవించేట‌ప్పుడు వీటిని తీసుకోండి.. శ‌రీరంపై నెగెటివ్ ఎఫెక్ట్ ప‌డ‌దు..!

September 3, 2023 7:42 PM

Alcohol : చాలామంది ఆల్కహాల్ కి ఎడిక్ట్ అయిపోయారు. ప్రతిరోజూ ఆల్కహాల్ ని కచ్చితంగా తీసుకుంటూ ఉంటారు. ఆల్కహాల్ కి అలవాటు పడిపోవడం వలన ఆరోగ్యం పాడవుతుందని గ్రహించాలి. కాబట్టి, వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. అయితే, ఆల్కహాల్ ని తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు, డీహైడ్రేషన్, గుండెలో మంట ఇలాంటివి వస్తూ ఉంటాయి. అయితే, ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే, ఆల్కహాల్ ని తీసుకునే ముందు వీటిని తీసుకోండి. అప్పుడు ప్రమాదం ఉండదు.

మ‌ద్యం తాగే ముందు గుడ్డు తీసుకోండి. గుడ్డులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. గుడ్డును తీసుకుని, మద్యం తాగడం వలన ఆకలి తగ్గుతుంది. ఆల్కహాల్ శోషణ ఆలస్యం అవుతుంది. ఆల్కహాల్ ని తీసుకునే ముందు, ఆమ్లెట్ తీసుకున్నా ఫ‌ర్వాలేదు. అరటి పండులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యానికి అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. మ‌ద్యం తాగే ముందు, అరటిపండు తీసుకోవడం కూడా మంచిదే. మ‌ద్యం తాగే ముందు కనుక మీరు అరటిపండు తీసుకుంటే, ఆల్కహాల్ వల్ల కలిగే ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యత ఉండదు.

take these foods when drinking Alcohol to avoid health issues
Alcohol

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చేప‌ల‌లో ఎక్కువ ఉంటాయి. ఆల్కహాల్ ని తీసుకునే ముందు చేపల‌ను తీసుకుంటే ప్రోటీన్ బాగా అందుతుంది. దాని వలన మీకు ఇబ్బంది కలగదు. అలానే, మీరు పెరుగుని తీసుకున్నట్లయితే, జీర్ణ సమస్యలు రావు. మ‌ద్యం తాగే ముందు చియా సీడ్స్ ని కూడా తీసుకోండి. అవకాడోల‌ని కూడా మ‌ద్యం తాగే ముందు తీసుకోవచ్చు. అప్పుడు ప్రమాదం ఏమీ కలగదు.

వీటిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆల్కహాల్ శోషణని నెమ్మదిస్తాయి. మ‌ద్యం తాగే ముందు టమాట, ఓట్స్ ని కూడా తీసుకోవచ్చు. చిలకడదుంపల్ని కూడా తీసుకోవడం మంచిది. ఇలా మ‌ద్యం తాగే ముందు, ఈ పదార్థాల‌ని తీసుకోవడం వలన ప్రమాదం నుండి దూరంగా ఉండొచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment