పూర్వ జ‌న్మ‌లో ఇలా చేసిన వారు ఈ జ‌న్మ‌లో పుత్రులుగా పుడ‌తార‌ట తెలుసా..?

August 28, 2023 8:02 AM

చాలా మంది అబ్బాయి పుట్టాలని కోరుకుంటూ వుంటారు. అబ్బాయి పుడితే బాగుండు అని దేవుళ్ళకి మొక్కుతూ వుంటారు కూడా. కానీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈరోజుల్లో ఒకటే. ఎవరు పుట్టాలని ఉంటే వారే పుడతారు. కొందరికి పుత్రికలు పుడితే, కొంత మందికి పుత్రులు పుడతారు. అయితే పుత్రుల గురించి చాలా మందికి ఈ విషయాలు తెలియ‌వు. ఇది చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారట.

నిజానికి చాలా మందికి ఈ విషయాలు తెలియవు. పుత్రులు ఏడు రకాలుగా జన్మించడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.. అయితే కచ్చితంగా మీరు దీనిని తెలుసుకోవాలి. పూర్వజన్మలో సొమ్మును దాచమని దాన్ని తీసుకోకుండా మరణించిన వాళ్లు, దాచిన సొమ్ము తీసుకోవడానికి ఇంట్లో పుత్రుడుగా పుడతారట. అలాగే పూర్వ జన్మలో ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతారో ఆ ఉపకారానికి బదులుగా పుత్రుడి కింద పుడతారట.

sons will born to these people

పూర్వజన్మలో అనుభవించిన సేవ, సుఖాలకి బదులు తీర్చడానికి పుత్రుడిగా జన్మించి తల్లిదండ్రులకి సేవ చేసుకుంటూ ఉంటారు. పూర్వజన్మలో ఏదైనా అపకారం చేసి దానికి ప్రతీకారం తీర్చుకోలేదు అని అనుకుంటే ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసిన వాడికి పుత్రుడు కింద పుడతారు. అలాగే పూర్వ జన్మలో మిగిలిన‌ శత్రుత్వాన్ని తీర్చుకోవడానికి కూడా ఈ జన్మలో పుత్రుడి కింద పుడతారట.

పూర్వజన్మలో బాకీ పడిన అప్పును చెల్లించడానికి కూడా పుత్రుడు కింద పుడతారు. ఏమీ ఆపేక్షించని వాడు కూడా పుత్రుని కింద పుట్టి విధులని తీరుస్తాడు. ఇలా పుత్రులుగా పుట్టి కర్మానుసారంగా వారి పనులు పూర్తికాగానే చనిపోతారు. లేదంటే దీర్ఘకాలం జీవించి ఉపకారం చేస్తారు. లేకపోతే ప్రతీకారం తీర్చుకుంటారు. అయితే పుత్రులు ఒక్కరే కాదు. భార్యా, భర్త, సోదరుడు, పని మనుషులు, పాడి పశువులు కూడా ఇలా జ‌న్మిస్తార‌ట‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment