Heart : ఈ టీ తాగితే మీ గుండె సేఫ్‌.. ఎలాంటి ఇబ్బంది రాదు..!

August 20, 2023 1:44 PM

Heart : ప్రతిరోజు చాలామంది టీ తాగుతూ ఉంటారు. టీ తాగడం మంచిదే. కానీ ఎక్కువగా టీ తాగితే ప్రమాదం. ఎక్కువ మంది ఈ రోజుల్లో గుండె సమస్యలతో బాధపడుతున్నారు. వయసు తో సంబంధం లేకుండా, గుండె జబ్బులు ఎప్పుడు ఎవరిలో వస్తున్నాయో కూడా తెలియడం లేదు. ఫిట్ గా ఉండే వాళ్ళు, జిమ్ చేసే వాళ్ళు కూడా గుండె సమస్యల కారణంగా ప్రాణాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏది ఏమైనా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.

ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి, సరైన ఆహార పదార్థాలను తీసుకోవడం, మంచి జీవన విధానాన్ని పాటించడం ముఖ్యం. అయితే, ప్రతిరోజు ఈ టీ లని తీసుకోవడం వలన క్యాన్సర్, గుండె జబ్బులు వంటి బాధలు ఉండవు. మరి గుండెకి మేలు చేసే ఆ టీల గురించి ఇప్పుడు చూద్దాం. బ్లాక్ టీ ఆరోగ్యానికి మంచిది. రోజు రెండు లేదా మూడు కప్పులు బ్లాక్ టీ తాగితే, ట్రైగ్లిజరాయిడ్స్ స్థాయిలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి.

your heart is safe with these teas
Heart

కాబట్టి, బ్లాక్ టీ ని తీసుకోండి. గ్రీన్ టీ తో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. గుండెకి కూడా గ్రీన్ టీ మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా బాగా అందుతాయి. వైట్ టీ తీసుకోవడం వలన కూడా గుండె ఆరోగ్యం బాగుంటుంది. వైట్ టీ లో ఉండే ఫ్లెవనాయిడ్స్ ధమనులని విస్తరిస్తాయి. రక్త పోటుని తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ ని కూడా ఇది తగ్గిస్తుంది.

రక్తం గడ్డకుండా చూస్తుంది వైట్ టీ. చమోమిలే టీ కూడా మీకు సహాయం చేస్తుంది. గుండె రోగాలని తగ్గిస్తుంది. నిద్ర బాగా వచ్చేలా చేస్తుంది. శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఇలా ఈ విధంగా మీరు ఈ టీలను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా గుండె జబ్బులు రావు. ఆరోగ్యం బాగుంటుంది. మరి ఆలస్యం ఎందుకు ఈసారి ఈ టీలను తీసుకోండి. మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now